క్రికెట్లో అత్యంత వేగంగా ఎదుగుతోన్న టీమ్ఇండియా బ్యాటర్ శుభ్‌మన్ గిల్.. జనవరి నెలకు గానూ ఐసీసీ 'ప్లేయర్ ఆఫ్ ది మంత్'గా ఎంపికయ్యాడు. న్యూజిలాండ్‌పై అద్భుత ప్రదర్శన చేసి ఈ ఘనత దక్కించుకున్నాడు. గత నెలలో శ్రీలంక, కివీస్‌తో జరిగిన సిరీస్‌లలో శుభ్‌మన్ రాణించాడు. న్యూజిలాండ్‌తో హైదరబాద్ వేదికగా జరిగిన మొదటి వన్డేలో అద్భుత ప్రదర్శన చేసిన గిల్.. అనంతరం టీ20 సిరీస్‌లోను సెంచరీ సాధించి మెరిశాడు. దీంతో పాటు శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ గిల్ ఓ సెంచరీ చేశాడు.
'ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్'గా శుభ్‌మన్ గిల్
టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్.. మరో ఘనత దక్కించుకున్నాడు. న్యూజిలాండ్, శ్రీలంక సిరీస్‌ల్లో అద్భుత ప్రదర్శనతో జనవరి నెలకు గానూ ఐసీసీ 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డు సాధించాడు.
మొత్తంగా జనవరిలో శుభ్‌మన్ 567 పరుగులు బాదాడు. ఇక, ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు కోసం భారత జట్టు స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్, న్యూజిలాండ్ బ్యాటర్ డెవన్ కాన్వేతో.. శుభ్‌మన్ గిల్ పోటీ పడ్డాడు. అయినా ఐసీసీ అవార్డు గిల్‌నే వరించింది.
కాగా, మహిళల విభాగంలో జనవరి నెలకు గాను 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డును ఇంగ్లాండ్ యువ ప్లేయర్ గ్రేస్ స్క్రీవెన్స్‌ను వరించింది. జనవరిలో జరిగిన అండర్-19 వరల్డ్‌కప్‌లో ఈ క్రికెటర్ అద్భుత ప్రదర్శన చేసింది. ఇక, ఈ అవార్డు సాధించిన అతిచిన్న వయసు క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది.