తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఇంగ్లాండ్​లో భారత మహిళా క్రికెటర్​కు చేదు అనుభవం.. ఆగంతకుడు రూమ్​లో దూరి.. - తానియా భాటియాకు చేదు అనుభవం

ఇంగ్లాండ్​ గడ్డపై భారత మహిళా క్రికెటర్, వికెట్ కీపర్ తానియా భాటియా‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆమె గదిలోకి ఓ ఆంగతకుడు ప్రవేశించి ఏం చేశాడంటే?

tania bhatiya
తానియా భాటియా

By

Published : Sep 26, 2022, 10:44 PM IST

ఇంగ్లాండ్​ గడ్డపై భారత మహిళా క్రికెటర్, వికెట్ కీపర్ తానియా భాటియా‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆమె గదిలోకి ఓ ఆగంతకుడు ప్రవేశించి బ్యాగును దొంగిలించాడు. అందులో డబ్బులతో పాటు కార్డులు, విలువైన నగలు, వాచీలు ఉన్నట్లు తానియ తెలిపింది. తాను గదిలో లేనప్పుడు ఈ ఘటన జరిగినట్లు వెల్లడించింది. ఈసీబీ, హోటల్ సిబ్బంది నిర్లక్ష్యంపై మండిపడింది.

"లండన్‌ మైదా వాలే మారియట్ హోటల్ మేనేజ్‌మెంట్‌ తీరు నన్ను షాక్‌కు గురి చేసింది. నేను భారత క్రికెట్ జట్టుతో ఉండగా.. గుర్తు తెలియని వ్యక్తి నా రూమ్‌లోకి దూరి బ్యాగు దొంగిలించాడు. అందులో డబ్బు, కార్డుల, వాచీలు, జ్యూవెలరీ కూడా ఉన్నాయి. ఇక్కడ ఏ మాత్రం సురక్షితంగా లేదు. దీనిపై వెంటనే విచారణ చేసి నా బ్యాగును తిరిగి అందిస్తారని ఆశిస్తున్నా. ఇంగ్లాండ్​ క్రికెట్ బోర్డు, తమ దేశంలో పర్యటించే క్రికెటర్లకు ఇలా భద్రత లేని హోటళ్లలో బస కల్పిస్తారని అనుకోలేదు. నా బ్యాగును త్వరగా తెచ్చి ఇవ్వండి" అంటూ సోషల్​మీడియాలో ట్వీట్​ చేసింది. కాగా, మూడు వన్డేల సిరీస్ కోసం ఇంగ్లాండ్​ పర్యటనకు వెళ్లిన భారత జట్టు అద్భుత ప్రదర్శనతో క్లీన్ స్వీప్ చేసింది. లెజండరీ ప్లేయర్ ఝులాన్ గోస్వామికి ఘన వీడ్కోలు పలికింది.

ఇదీ చూడండి: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్​.. ఆ ఇద్దరు స్టార్స్​ ఔట్​!

ABOUT THE AUTHOR

...view details