T20 Worldcup 2024 Format: ఎంతో ఉత్కంఠగా జరిగిన 2022 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ జట్టు ఆల్‌రౌండ్ ఫెర్మారెన్స్తో టైటిల్ గెలుచుకుంది. అయితే 2024లో అమెరికా, వెస్టండీస్లో జరగనున్న టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారీ మార్పులు జరగనున్నాయి. టైటిల్ కోసం 16 నుంచి 20 జట్లు తలపడనున్నాయి. దాంతో పాటు వచ్చే సీజన్లో క్వాలిఫైయర్ మ్యాచ్‌లు కూడా ఉండవు.
టీ20 ప్రపంచకప్ ఫార్మాట్లో భారీ మార్పులు.. పోటీలో 20 జట్లు.. క్వాలిఫైయర్ మ్యాచ్‌లకు గుడ్‌బై - T20 Worldcup 2024 20 teams
2024 టీ20 ప్రపంచకప్ ఫార్మాట్లో భారీ మార్పులు జరగనున్నాయి. ఈసారి టైటిల్ కోసం 20 జట్లు తలపడనున్నాయి. క్వాలిఫైయర్ మ్యాచులు కూడా ఉండవు. అయితే టోర్నీకి జట్లు ఎలా అర్హత సాధిస్తాయి? ఎన్ని గ్రూపులుగా విభజిస్తారు? వంటి ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఈ స్టోరీ చదివేయండి.
ఆతిథ్య జట్లుగా అమెరికా, వెస్టిండీస్‌లు నేరుగా టోర్నీకి అర్హత సాధిస్తాయి. 20 జట్ల టోర్నమెంట్‌ను నాకౌట్‌లకు ముందు రెండు దశల్లో నిర్వహించనున్నారు. అయితే ఈ దశ 2021, 2022లో ఆడిన మొదటి రౌండ్ లేదా సూపర్ 12 ఫార్మాట్‌కు భిన్నంగా ఉంటుంది. అన్ని జట్లను 4 గ్రూపులుగా విభజిస్తారు. ఒక్కో గ్రూపులో 5 జట్లు ఉంటాయి. ప్రతి గ్రూప్‌లోని టాప్ 2 జట్లు సూపర్ 8లోకి ప్రవేశిస్తాయి. ఇక్కడ 8 జట్లను 2 గ్రూపులుగా విభజిస్తారు. రెండు గ్రూపుల్లో టాప్-2లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌లోకి ప్రవేశిస్తాయి.
2024 టీ20 ప్రపంచకప్ టోర్నీలో రెండు స్థానాలు ఇప్పటికే ఆతిథ్య వెస్టిండీస్, యూఎస్ఏ కోసం రిజర్వ్ అయ్యాయి. ఇక 2022 ప్రపంచ కప్ ప్రదర్శన, నవంబర్ 14 వరకు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా తదుపరి 10 జట్లను నిర్ణయించనున్నారు. అంటే ఇప్పటికే 10 టీమ్‌లను ఖరారు చేశారు. అలాగే ప్రాంతీయ అర్హత ఆధారంగా తదుపరి 8 జట్లను నిర్ణయిస్తారు. ఆఫ్రికా, ఆసియా, యూరప్‌లు ఒక్కొక్కటి రెండు క్వాలిఫికేషన్ స్పాట్‌లను కలిగి ఉండగా, అమెరికా, తూర్పు ఆసియా పసిఫిక్‌లు ఒక్కో స్థానాన్ని కలిగి ఉన్నాయి. ప్రాంతీయ క్వాలిఫికేషన్‌లో గెలిచిన జట్టు భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, పాకిస్థాన్ వంటి జట్ల గ్రూప్‌లో చోటు దక్కించుకుంటుంది.