టీ20 ప్రపంచకప్ హోరాహోరీగా సాగుతోంది. దాదాపు సెమీస్ బెర్త్‌లు ఫిక్స్ అయ్యాయి . గ్రూపు -1 నుంచి న్యూజిలాండ్, ఇంగ్లాండ్ సెమీస్‌కు చేరగా.. గ్రూపు-2 నుంచి భారత్, పాకిస్థాన్ నాకౌట్ పోరుకు అర్హత సాధించాయి. గ్రూపు-2లో నెదర్లాండ్స్ చేతిలో సౌతాఫ్రికా ఓడిపోవడంతో భారత్.. బంగ్లాపై విజయం సాధించడం వల్ల పాకిస్థాన్ సెమీస్‌కు చేరాయి. దీంతో ఇప్పుడు క్రికెట్ ప్రేమికుల దృష్టి అంతా టీమ్ఇండియా, పాక్ జట్లపైనే పడింది. ఈ టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య ఇప్పటికే ఓ మ్యాచ్ జరగ్గా.. దాంట్లో టీమ్ఇండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మెగా టోర్నీలో చిరకాల ప్రత్యర్థులు మరోసారి తలపడటానికి అవకాశాలు ఉన్నాయి.
బుధవారం జరిగే తొలి సెమీ ఫైనల్స్‌లో గ్రూప్-1లో అగ్రస్థానంలో నిలిచిన న్యూజిలాండ్‌తో పాకిస్థాన్ అమితుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్.. కివీస్‌ని ఓడిస్తే ఫైనల్స్‌కు చేరుకుంటుంది. గురువారం జరిగే రెండో సెమీస్‌లో భారత్, ఇంగ్లాండ్ తలపడనున్నాయి. ఈ పోరులో టీమ్ఇండియా.. ఇంగ్లాండ్‌ని ఓడిస్తే పాకిస్థాన్‌తో టైటిల్ పోరులో తలపడుతుంది. ఇలా గనక జరిగితే క్రికెట్ అభిమానులకు మరోసారి పసందైన వినోదం ఖాయం.