తెలంగాణ

telangana

ETV Bharat / sports

T20 World Cup 2021: మెగాటోర్నీలో ఎవరికైనా కరోనా సోకితే?

మరికొద్ది రోజుల్లో టీ20 ప్రపంచకప్(T20 World Cup 2021) ప్రారంభంకాబోతోంది. కరోనా సమయంలో జరుగుతోన్న తొలి మెగాటోర్నీ ఇదే కావడం విశేషం. దీంతో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. ఈ నేపథ్యంలో టోర్నీ కోసం ఐసీసీ(ICC News) విధించిన కరోనా నిబంధనలు ఏంటో చూద్దాం.

By

Published : Oct 8, 2021, 11:25 AM IST

T20 world cup
టీ20 ప్రపంచకప్

మరికొద్ది రోజుల్లో టీ20 ప్రపంచకప్ (T20 Worldcup news) ప్రారంభంకానుంది. ఈ టోర్నీలో పాల్గొనేందుకు ఒక్కొక్క జట్టు యూఏఈ చేరుకుంటున్నాయి. దుబాయ్, అబుదాబి, షార్జా, మస్కట్ వేదికలుగా ఈ టోర్నీ నాలుగు వారాలపాటు క్రీడాభిమానుల్ని అలరించనుంది. కాగా, కరోనా తర్వాత ఓ మెగా ఐసీసీ టోర్నీ జరగడం ఇదే తొలిసారి. దీంతో మహమ్మారి పట్ల జాగ్రత్తలు పాటించాలని బోర్డులకు సూచించింది ఐసీసీ ICC News). ఈ నేపథ్యంలో కొన్ని నిబంధనలు రూపొందించారు అధికారులు. అవేంటో చూద్దాం.

  • సన్నిహితంగా ఉంటే..

ఓ వ్యక్తికి కరోనా సోకి.. 48 గంటల ముందు అతడితో పాటు ఓ వ్యక్తి 15 నిమిషాల పాటు రెండు మీటర్ల దూరంలో ఉంటే.. ఆ వ్యక్తిని క్లోజ్ కాంటాక్ట్​గా పరిగణిస్తారు. ఇలాంటి సమయంలో ఈ క్లోజ్ కాంటాక్ట్ కూడా 6 రోజుల పాటు ఐసోలేషన్​లో ఉండాలి.​

క్యాజువల్ కాంటాక్ట్ (దగ్గరగా ఉన్నా మాస్క్ పెట్టుకుని ఉంటే..)ను మాత్రం కేవలం 24 గంటలు పరిశీలనలో ఉంచి టెస్టులు చేస్తారు.

  • హాస్పిటల్ సౌకర్యాలు

ఏ ఆటగాడైనా హాస్పిటల్ వెళ్లాల్సి వస్తే.. బయోబబుల్​లోనే దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తారు. ఆటగాళ్ల మానసిక ఆరోగ్యం కోసం సైకాలజిస్ట్​ కూడా అందుబాటులో ఉంటారు.

  • బబుల్ నిబంధన ఉల్లంఘిస్తే?

ఇప్పటివరకైతే ఈ విషయంపై స్పష్టమైన నిబంధనలు రూపొందించలేదు. అయితే బయో సేఫ్టీ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. బయో బబుల్ రూల్స్​ను అతిక్రమిస్తే ఆ ఆటగాడిపై కఠిన చర్యలు తీసుకుంటారు. ఈ విషయంలో బోర్డులు కూడా కఠినంగా ఉండాలని ఐసీసీ చెప్పినట్లు తెలుస్తోంది.

  • ప్రేక్షకులు రెండు డోస్​ల వ్యాక్సిన్ వేసుకోవాలా?

అబుదాబి, ఒమన్​లో మ్యాచ్​లు వీక్షించాలనుకుంటే కచ్చితంగా వ్యాక్సిన్ డబుల్ డోస్ వేయించుకోవాలి. దుబాయ్, షార్జాలో మాత్రం కొన్ని మినహాయింపులు ఉన్నాయి.

  • ఆటగాళ్ల కుటుంబాలకు అనుమతి ఉందా?

పరిమితితో కూడిన సంఖ్యలో కుటుంబ సభ్యులు హాజరు కావొచ్చు. ఈ విషయంలో ప్రస్తుతం ఐపీఎల్​ రూల్స్​నే ఫాలో అవుతున్నారు.

  • ప్రేక్షకులు ఇవి పాటించాల్సిందే?

మ్యాచ్​లు చూడటానికి వచ్చిన ప్రేక్షకులు కచ్చితంగా మాస్క్ ధరించాలి. అలాగే వారు ఆటగాళ్లను కలిసేందుకు ఎలాంటి అనుమతి లేదు.

ఇవీ చూడండి: 'నాకే అధికారం ఉంటే.. ఆ మాటల్ని వినిపిస్తా'

ABOUT THE AUTHOR

...view details