తెలంగాణ

telangana

ETV Bharat / sports

Kohli News: మెంటార్​గా 'ధోనీ'.. ఈసారైనా 'కోహ్లీ' లక్కు​ మారేనా? - CRICKET IN INDIA

విరాట్​ కోహ్లీ దూకుడు.. రవిశాస్త్రి ఆత్మవిశ్వాసం.. 'మిస్టర్​ కూల్​' ఎంఎస్​ ధోనీ.. ఈ ముగ్గురి కలయికలో టీమ్​ ఇండియా టీ-20 ప్రపంచకప్​నకు (T20 world cup 2021) వెళ్లబోతోంది. కోహ్లీ నేతృత్వంలో భారత్​ తొలి ప్రపంచకప్​ నెగ్గేందుకు ఇదే మంచి సమయం అంటున్నారు క్రీడా విశ్లేషకులు. మరి ధోనీ అనుభవం మెంటార్​గా టీమ్​ ఇండియాకు (Mentor Dhoni news) ఎలా ఉపయోగపడుతుంది.. కెప్టెన్​గా భారత్​కు ఇప్పటివరకు ఒక్క టోర్నీ అందించని కోహ్లీకి (Kohli captaincy) అదృష్టం కూడా కలిసొస్తుందా? ధోనీ- కోహ్లీ- రవిశాస్త్రి త్రయం మాయ చేస్తుందా?

T20 world cup 2021
కోహ్లీ సేనకు ఇదే మంచి టైం

By

Published : Sep 22, 2021, 9:54 AM IST

వరల్డ్​ కప్​కు.. భారత మెంటార్​గా మాజీ కెప్టెన్​ మహేంద్ర సింగ్​ ధోనీ (Mentor Dhoni news) నియామకంపై భిన్నాభిప్రాయాలు వినిపించినా, ఇక్కడ మనం కొన్ని విషయాలు గమనించాలి. దూకుడైన కెప్టెన్​గా పేరున్న విరాట్​ కోహ్లీకి(Kohli captaincy) .. మిస్టర్​ కూల్​ ధోనీ(Dhoni news) కలిస్తే.. వీరిద్దరికీ సక్సెస్​ఫుల్​ కెప్టెన్​ రవిశాస్త్రి తోడైతే.. టీమ్​ ఇండియా వరల్డ్​ కప్ ​(T20 world cup 2021) నెగ్గేందుకు ఇంతకంటే మంచి సమయం దొరకదు అంటున్నారు క్రీడా విశ్లేషకులు. పొట్టి క్రికెట్​లో భారత ప్రదర్శన కూడా మెరుగ్గానే ఉంది. అన్నీ కలిసొస్తే.. కోహ్లీ సారథ్యంలో భారత్​ తొలి మేజర్​ టోర్నీ(T20 world cup 2021) గెలిచే అవకాశం ఉంటుంది.

అయితే ధోనీ మెంటార్​గా ఉంటే టీమ్​ ఇండియాకు (Dhoni mentor team india) ఏం ప్రయోజనమంటే..

నాలుగున్నర నెలల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ప్రారంభమైన ఐపీఎల్​-2021లో (IPL 2021 schedule) తొలి రెండు మ్యాచ్​లను ఓసారి చూద్దాం..

చెన్నై VS ముంబయి

ముంబయి ఇండియన్స్​పై (MI vs CSK) 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినా.. కాపాడుకోగల స్కోరు సాధించింది చెన్నై సూపర్​ కింగ్స్​. 156 పరుగులకే పరిమితమైనా.. 20 పరుగుల తేడాతో గెలవగలిగింది. ఇదంతా.. ధోనీ కెప్టెన్సీ (Dhoni captaincy record) వల్లే అని చెప్పొచ్చు. ఫీల్డర్లను సరైన స్థానాల్లో మోహరించడం, బౌలర్లపై విశ్వాసం ఉంచడం, ఎప్పుడు ఎవరిని బరిలోకి దించాలో వ్యూహాలు పన్నడం ధోనీకే చెల్లింది. భారత్​ తరఫున కూడా ఇన్నేళ్లు చేసింది ఇదే.

ఆర్​సీబీ VS కోల్​కతా​

ఐపీఎల్​ రెండోదశలో జరిగిన రెండో మ్యాచ్​లో కోల్​కతాతో తలపడింది కోహ్లీ నేతృత్వంలోని రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు (RCB vs KKR) 2021. సీఎస్​కే కంటే కాస్త మెరుగ్గానే ఇన్నింగ్స్​ ప్రారంభించినా 92 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా.. 9 వికెట్ల తేడాతో అలవోకగా నెగ్గింది కోల్​కతా.

92 పరుగులను కాపాడుకోవడం.. అంత సులభం కాదని చెప్పొచ్చు. కోహ్లీ కూడా ఏం చేయలేకపోయాడు. ప్రపంచకప్​లో ఇదే పరిస్థితి వస్తే ఎలా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అందుకే.. అక్కడ ధోనీ ఉంటే, ఆ కెప్టెన్సీ నైపుణ్యాలు కోహ్లీ అలవరచుకుంటాడని, అది టీమ్​ ఇండియాకు (Virat Kohli Dhoni) లాభిస్తుందని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

92 పరుగులను కాపాడటం.. ధోనీకి కూడా కష్టమే అన్న వాదనలు వినిపించినా, కూల్​ అండ్​ కామ్​గా ఉండే ధోనీ ఉంటే పరిస్థితులు వేరేలా ఉండొచ్చని అంటున్నారు.

ధోనీ, కోహ్లీకి ఇదే తేడా..

తిరుగులేని ధోనీ..

  • తొలిసారి జరిగిన 2007 టీ-20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్​, 2013 ఛాంపియన్స్​ ట్రోఫీ.. ధోనీ (Mentor Dhoni news) సారథ్యంలోనే గెల్చింది భారత్​.
  • ఐపీఎల్​లో చెన్నై సూపర్​కింగ్స్​ను కూడా విజయవంతంగా నడిపిస్తున్నాడు. మూడు టైటిళ్లను అందించడం సహా.. గతేడాది తప్ప అన్నిసార్లు జట్టును ప్రతిసారీ ప్లేఆఫ్స్​కు చేర్చాడు.
  • ఇంకా.. ఛాంపియన్స్​ లీగ్​లోనూ రెండుసార్లు ట్రోఫీ నెగ్గాడు.

ఐసీసీ టోర్నీ లేని కోహ్లీ..

  • కోహ్లీ (Kohli latest news) మాత్రం టీమ్​ ఇండియాను విజయపథంలో నడిపించినా.. ఒక్క మేజర్​ ట్రోఫీని జట్టుకు అందించలేకపోయాడు.
  • భారత్​.. 2017 ఛాంపియన్స్​ ట్రోఫీలో ఫైనల్లో పాక్​ చేతిలో ఓడింది.. 2019 వన్డే ప్రపంచకప్​లో సెమీస్​లోనే నిష్క్రమించింది.. ఇటీవల జరిగిన ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్లో కోహ్లీ సారథ్యంలోనే మన జట్టు ఓడిపోయింది.
  • ఐపీఎల్​లో ఆర్​సీబీ కెప్టెన్సీ బాధ్యతలను 2013లో వెటోరి నుంచి స్వీకరించిన విరాట్​.. అక్కడా విజయవంతం కాలేకపోయాడు.

భారత కెప్టెన్​గా సాధించిన ఘనతల్లో.. ధోనీ, కోహ్లీకి సారూప్యత ఏంటంటే ఇద్దరూ టెస్టుల్లో టీమ్​ ఇండియాను నెం.1గా నిలిపారు.

ఇది ప్లస్​..

ధోనీ వ్యూహచతురత, క్రీడానైపుణ్యాలు.. చాలా సందర్భాల్లో ప్రత్యర్థి కంటే టీమ్​ఇండియాను(Dhoni captaincy record) ముందువరుసలో నిలిపాయి. బయట ఉండి కూడా ఆటను పూర్తిగా చదవడం, వికెట్​ కీపింగ్​ చేస్తూ.. బౌలర్లకు చిట్కాలు చెబుతుండటం, వికెట్ల మధ్య పరిగెత్తడం.. ఇలా అన్నింటినీ సరిగ్గా అంచనావేయగలడు. ఇంకా.. పర్​ఫెక్ట్​ ఫినిషర్​గానూ పేరు తెచ్చుకున్నాడు మహీ.

అయితే.. అంతర్జాతీయ క్రికెట్లో కెరీర్​ చివరిదశలో ఉన్న సమయంలో ధోనీ అంతలా రాణించలేకపోయాడు. కోహ్లీకీ అదృష్టం కలిసిరాలేదు. అయితే.. మళ్లీ ధోనీని మెంటార్​గా నియమించడం (Dhoni mentor team india) టీమ్​ ఇండియా విజయావకాశాల్ని కచ్చితంగా పెంచుతుందంటున్నారు విశ్లేషకులు.

ఇదే చివరిది..

ఇంకా.. 2021 టీ-20 ప్రపంచకప్​(T20 world cup 2021) ​తనకు కెప్టెన్​గా చివరిది అని ఇప్పటికే ప్రకటించాడు విరాట్​. అందుకే టైటిల్​ నెగ్గాలని పట్టుదలతో ఉన్నాడు. ఒకవేళ భారత్​కు టైటిల్​ అందించి.. కెప్టెన్​గా (Kohli captaincy) తప్పుకొంటే అప్పుడు మంచి వీడ్కోలు లభించినట్లవుతుంది.

మరి.. ధోనీ- కోహ్లీ- రవిశాస్త్రి త్రయం మాయ చేసి.. భారత్​కు పొట్టి ప్రపంచకప్​ అందిస్తుందేమో చూడాలి.

ఐసీసీ టీ-20 ప్రపంచకప్​ అక్టోబర్​ 17న ప్రారంభం కానుంది. యూఏఈ, ఒమన్​ వేదికలు. నవంబర్​ 14న ఫైనల్​. భారత్​ తన తొలి మ్యాచ్​లో దాయాది పాకిస్థాన్​తో (Pak vs India 2021) తలపడనుంది. పూర్తి షెడ్యూల్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

పొట్టి వరల్డ్​కప్(T20 world cup 2021)​ కోసం.. భారత్​ ఇప్పటికే జట్టును ప్రకటించింది. కోహ్లీ కెప్టెన్​గా, రోహిత్​ శర్మ వైస్​ కెప్టెన్​గా వ్యవహరించనున్నారు. ధోనీని మెంటార్​గా నియమించింది బీసీసీఐ. శిఖర్​ ధావన్​, యుజ్వేంద్ర చాహల్​, కుల్​దీప్​ యాదవ్​.. లాంటి సీనియర్లకు జట్టులో చోటు దక్కలేదు.పూర్తి జట్టు కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details