తెలంగాణ

telangana

ETV Bharat / sports

65 రోజుల తర్వాత ఆమెను చూసిన సూర్య- ఏం చేశాడంటే? - సూర్యకుమార్ యాదవ్ దేవిషా శెట్టి

టీమ్ఇండియా బ్యాట్స్​మన్ సూర్యకుమార్ యాదవ్, అతడి భార్య దేవిషా శెట్టి.. 65 రోజుల తర్వాత కలుసుకున్నారు. ప్రస్తుతం ఈ జంట లండన్​ వీధుల్లో సరదాగా చక్కర్లు కొడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్​గా మారాయి.

suryakumar yadav
సూర్యకుమార్ యాదవ్

By

Published : Aug 20, 2021, 4:31 PM IST

Updated : Aug 20, 2021, 5:17 PM IST

టీమ్ఇండియా బ్యాట్స్​మన్ సూర్యకుమార్ యాదవ్​ రెండు నెలల తర్వాత తన భార్య దేవిషా శెట్టిని కలుసుకున్నాడు. ఈ జంట ప్రస్తుతం లండన్​ వీధుల్లో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. 65 రోజుల తర్వాత కలుసుకున్న ఈ జోడీ తమ విలువైన సమయాన్ని గడుపుతోంది.

సూర్యకుమార్ యాదవ్​, దేవిషా శెట్టి సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటారు. తమ ఫొటోలను షేర్​ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటారు. తాజాగా ఇంగ్లాండ్​​లో ఇద్దరు కలిసి డ్యాన్స్​ చేస్తున్న వీడియోను ఫ్యాన్స్​తో పంచుకున్నారు. ఇప్పుడు ఇది వైరల్​గా మారింది.

దేశవాళీ టోర్నీలతో పాటు ఐపీఎల్​లో నిలకడగా రాణించిన సూర్య.. ఆ తర్వాత భారత జట్టులో చోటు సంపదించాడు. తొలుత టీ20ల్లో జట్టులోకి వచ్చిన అతడు.. శ్రీలంకతో సిరీస్​లో వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. ఈ సిరీస్​లో అదరగొట్టిన సూర్యకు ఇంగ్లాండ్​​లో ఉన్న టెస్టు జట్టు నుంచి పిలుపొచ్చింది. రిజర్వ్​ ప్లేయర్​గా తీసుకుంది. సుదీర్ఘ కాలం టీమ్ఇండియాలో చోటు కోసం పరితపించిన యాదవ్​కు అనతికాలంలోనే మూడు ఫార్మాట్లలో ఆడే అవకాశం దక్కించుకున్నాడు.

ఇదీ చదవండి:MS Dhoni: కొత్త లుక్​లో ధోనీ.. మురిసిపోతున్న ఫ్యాన్స్​

Last Updated : Aug 20, 2021, 5:17 PM IST

ABOUT THE AUTHOR

...view details