తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆ 'షాట్లు' అతడి దగ్గర నేర్చుకుంటా: సూర్య కుమార్​ యాదవ్​

టీ20ల్లో ప్రపంచ నెంబర్‌ వన్‌ బ్యాటర్‌గా నిలిచిన సూర్యకుమార్‌ యాదవ్‌ దక్షిణాఫ్రికా యువ ఆటగాడు డీవాల్డ్‌ బ్రెవిస్‌​పై ప్రశంసలు కురిపించాడు. కొన్ని సందర్భాల్లో తాను అతడని ఫాలో అయ్యే ప్రయత్నం చేస్తానని తెలిపాడు. గతేడాది నవంబరులో జరిగిన దక్షిణాఫ్రికా దేశీయ టీ20 టోర్నీలో భాగంగా బ్రెవిస్‌ ప్రదర్శన తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు.

Surya Kumar Yadav  Dewald Bravis
Surya Kumar Yadav Dewald Bravis

By

Published : Jan 8, 2023, 1:44 PM IST

శ్రీలంకతో జరిగిన చివరి టీ20 మ్యాచ్​లో సూర్యకుమార్‌ సృష్టించిన సునామీ క్రికెట్‌ అభిమానులను ఉర్రూతలూగించింది. రాజ్‌కోట్‌ వేదికగా శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో సూర్య తన మూడో టీ20 శతకాన్ని నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో సూర్య తన బ్యాట్‌కు పని చెప్పిన తీరు అందరిని కట్టిపడేసింది. అయితే, ఈ మిస్టర్‌ 360 మాత్రం తాను దక్షిణాఫ్రికా ఆటగాడు డీవాల్డ్‌ బ్రెవిస్‌ బ్యాటింగ్‌కు అభిమానినంటూ పేర్కొన్నాడు. అతడి పవర్‌ హిట్టింగ్‌ సామర్థ్యం అద్భుతమంటూ తెలిపాడు. రానున్న ఐపీఎల్‌లో అతడితో డ్రెస్సింగ్‌ రూంను పంచుకున్నప్పుడు బ్రెవిస్‌ నుంచి నో లుక్‌ షాట్స్‌ను తాను నేర్చుకోవాలనుకుంటున్నానని చెప్పాడు. బ్రెవిస్‌తో కలిసి ఓ మీడియా కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో సూర్య ఈ వ్యాఖ్యలు చేశాడు. గతేడాది నవంబరులో జరిగిన దక్షిణాఫ్రికా దేశీయ టీ20 టోర్నీలో భాగంగా బ్రెవిస్‌ ప్రదర్శన తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు.

"సాధారణంగా క్రికెట్‌లో బ్యాటర్‌ బలమైన షాట్‌కొట్టిన అనంతరం బంతి ఏ దిశగా వెళుతుందో ఓ సారి చూసుకుంటాడు. కానీ, నో లుక్‌ షాట్‌లో బ్యాటర్‌ ఆత్మవిశ్వాసంతో బంతిని బాది ఆ దిక్కుకు చూడకుండా ఉంటాడు. ఇటీవల దేశీయ క్రికెట్‌ ఛాలెంజ్‌ టీ20లో నువ్వు 50-55 బంతుల్లో 160కి పైగా పరుగులు చేయడం నేను చూశాను. ఒక వేళ వన్డేల్లో వంద బంతులు ఆడే అవకాశం వస్తే త్రిశతకం కొడతావేమో. కొన్ని సార్లు నీ బ్యాటింగ్‌ని నేను అనుకరించేందుకు ప్రయత్నిస్తాను. నువ్వు ఆ నో లుక్‌ షాట్లు, నోలుక్‌ సిక్స్‌లు ఎలా ఆడతావో నాకు కూడా నేర్పించు" అంటూ సూర్య బ్రెవిస్​ను ఉద్దేశిస్తూ అన్నాడు.

దీనికి సమాధానంగా బ్రెవిస్‌ స్పందిస్తూ.. "నీ ప్రశంసను నేను గౌరవంగా భావిస్తాను. సరదా విషయం ఏమిటంటే నేను ఎప్పుడూ ఆడినట్టుగానే ఆరోజూ ఆడాను. ఆ సమయంలో ఆ షాట్లు నేను కూడా ఊహించలేదు. ఓ సందర్భంలో నేను అన్ని బంతులను సిక్స్‌ కొట్టేందుకు ప్రయత్నిస్తాను అని నాన్‌ స్ట్రైకర్‌తో కూడా చెప్పాను. నాకు తెలియకుండానే ఆ షాట్లు కొట్టాను. ఆ ఇన్నింగ్స్‌ నాకు చాలా ప్రత్యేకం. కానీ, ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ప్రపంచ నంబర్‌ వన్‌ టీ20 బ్యాటర్‌గా నువ్వు సాధించిన ఘనత మాత్రం చాలా గొప్పది" అంటూ బ్రెవిస్‌ సుర్యను పొగడ్తలతో ముంచెత్తాడు.

సూర్య అరుదైన రికార్డ్​..
సూర్య కుమార్​ యాదవ్​ అరుదైన రికార్డ్​ను తన ఖాతాలో వేసుకున్నాడు. కేవలం 843 బంతుల్లో అత్యంత వేగంగా 1500 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా ఘనత సాధించాడు. టీ20 క్రికెట్​ చరిత్రలో 1500 పరుగుల మార్కును అత్యంత వేగంగా అందుకున్న భారత మూడో బ్యాటర్​గా నిలిచాడు. సూర్య కన్నా ముందు విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, ఆస్ట్రేలియన్ ఆటగాడు ఆరోన్ ఫించ్, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్​లు ఈ మైలురాయిని చేరుకున్నారు.
శనివారం జరిగిన మ్యాచ్​లో సూర్యకుమార్ కేవలం 45 బంతుల్లోనే తన మూడో టీ20లో శతకం సాధించాడు. కేవలం 51 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్లతో 112 పరుగులు చేసి నాటౌట్​గా నిలిచాడు. సూర్య స్వైర విహారంతో మూడు టీ20ల సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది.

ABOUT THE AUTHOR

...view details