టీమ్‌ఇండియా ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై బోర్డు కచ్చితమైన నిబంధనలు పాటిస్తోందని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు అన్నారు. అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించారని తెలిపారు. క్రికెటర్లు గాయాలను దాస్తున్నారని, ఫిజియోలు వాటిని గుర్తించడం లేదన్న మాజీ క్రికెటర్ సాబా కరీమ్ వ్యాఖ్యలను ఖండించారు. ఇది దాదా, గిల్‌ను అవమానించడమే అవుతుందని విమర్శించారు.
"సాబా కరీమ్ వ్యాఖ్యలు సౌరభ్ గంగూలీ నాయకత్వాన్ని ప్రశ్నించినట్లున్నాయి. ఆటగాళ్ల ఎంపిక, ఫిట్‌నెస్ అంశాల్లో నిబంధనలు పాటించడంపై దాదా సీరియస్‌గా ఉంటారు. ఇవి తీవ్రమైన ఆరోపణలు. ఆటగాడిగా శుభ్‌మన్ గిల్, నాయకుడిగా దాదా నిజాయతీని అనుమానించడమే అవుతుంది" అని బీసీసీఐ అధికారి అన్నారు.
"ఇది కరీమ్ ఏడుపే అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే కొంతకాలం క్రితం వరకు ఆయన బీసీసీఐలో పనిచేశారు. ఒక ఆటగాడి ఫిట్‌నెస్‌ను ఎలా పరీక్షిస్తారో, ఆ ప్రక్రియ ఏంటో ఆయనకు బాగా తెలుసు. ఈ రోజుల్లో ఆటగాళ్లు గాయాలను దాచే అవకాశమే లేదు. బహుశా అతడు క్రికెటర్ లేదా సెలక్టర్‌గా ఉన్నప్పుడు అలా జరిగిందేమో నాకు తెలియదు. కానీ అతడి మాటలు మాత్రం బాధాకరం" అని ఆ అధికారి తెలిపారు.