Gavaskar comments on Pant: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా యువ బ్యాటర్ రిషభ్ పంత్ అనవసర షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాల్సింది పోయి భారీ షాట్‌కు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. దీనిపై స్పందించిన మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్.. పంత్ ప్రదర్శన పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాడు.
'కొంచెం బాధ్యతగా ఆడాలి'.. పంత్‌కు గావస్కర్ చురకలు - పంత్‌కు గావస్కర్ చురకలు
Gavaskar comments on Pant: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అనవసర షాట్‌కు ప్రయత్నించి డకౌట్‌గా వెనుదిరిగాడు టీమ్ఇండియా బ్యాటర్ రిషభ్ పంత్. ఇతడు ఔటైన తీరును అందరూ తప్పుబట్టారు. టీమ్ఇండియా దిగ్గజం సునీల్ గావస్కర్ కూడా పంత్ ఔటైన విధానంపై అసహనం వ్యక్తం చేశాడు.
"క్రీజులో ఇద్దరూ కొత్తగా వచ్చిన బ్యాటర్లు ఉన్నపుడు (పంత్, విహారి ఆడుతుండగా) పంత్ షాట్ ఆడటం నచ్చలేదు. అది ఏ మాత్రం క్షమించరానిది. ఇది అతడి సహజ ఆటతీరు కాదు. ఈ సమయంలో కొంచెం బాధ్యతగా ఆడాల్సిన అవసరం ఉంది. బంతి శరీరంపైకి వస్తున్నప్పుడు ప్రశాంతంగా ఉండాలి. రహానే, పుజారాను చూడండి. వాళ్లు ఎంత ఓపికతో బ్యాటింగ్ చేశారు" అని పంత్ ఔటైన తీరును తప్పుబడ్డాటు గావస్కర్.
రెండో ఇన్నింగ్స్‌లో కేవలం మూడు బంతులాడిన పంత్ డకౌట్‌గా వెనుదిరిగాడు. రబాడ వేసిన బంతిని ముందుకొచ్చి భారీ షాట్ ఆడబోయి కీపర్ చేతికి చిక్కాడు. ఇప్పటివరకు ఈ సిరీస్‌లో రెండు టెస్టుల్లోనూ ఒక్క అర్ధసెంచరీ కూడా చేయలేకపోయాడు. ఇక ఈ రెండో ఇన్నింగ్స్‌లో 266 పరుగులకు ఆలౌటైంది భారత్. విహారి (40*) చివర్లో ఒంటరి పోరాటం చేశాడు. ఫలితంగా దక్షిణాఫ్రికా ముందు 240 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది టీమ్ఇండియా.