తెలంగాణ

telangana

ETV Bharat / sports

శ్రీలంకలో అండర్​-19 వరల్డ్​కప్​.. వివరాలు వెల్లడించిన ఐసీసీ

ICC Under-19 World Cup: 2024 నుంచి 2027 మధ్య అండర్​-19 ప్రపంచకప్‌నకు ఆతిథ్యం ఇవ్వనున్న దేశాల జాబితాను ఐసీసీ తాజాగా ప్రకటించింది. ఆ వివరాలు

Etv Bharat
Etv Bharat

By

Published : Nov 13, 2022, 10:30 PM IST

ICC Under-19 World Cup: యువ క్రికెటర్ల ప్రతిభను వెలుగులోకి తెచ్చే అండర్-19 ప్రపంచకప్‌ పోటీలకు రంగం సిద్ధమవుతోంది. 2024 నుంచి 2027 మధ్య ప్రపంచకప్‌నకు ఆతిథ్యం ఇవ్వనున్న దేశాల జాబితాను ఐసీసీ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు రానున్న ఏడాది శ్రీలంక ఈ టోర్నీకి వేదిక కానుంది. జింబాబ్వే, నమీబియా, మలేషియా, థాయిలాండ్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌ దేశాలు సైతం ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.

2024 పురుషుల అండర్‌-19 ప్రపంచకప్‌నకు శ్రీలంక, 2026 కప్‌నకు జింబాబ్వే, నమీబియా దేశాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. పురుషుల విభాగానికి సంబంధించి 14 జట్లలో 10 జట్లు ఇప్పటికే నేరుగా అర్హత సాధించాయి. దక్షిణాఫ్రికా, జింబాబ్వే ఆతిథ్య దేశాలు కావడంతో ముందుగానే ఈ జాబితాలో చేరాయి. ఆ సమయానికి వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌ 8లో ఉన్న జట్లకు సైతం చోటుదక్కనుంది. ఐసీసీ గ్లోబల్‌ క్వాలిఫయర్‌ సిరీస్‌ ఫలితాల ఆధారంగా మిగిలిన 4 జట్లు అర్హత సాధించనున్నాయి.

ఐసీసీ అండర్‌-19 ప్రపంచకప్‌ 2025 మహిళల టోర్నీ మలేసియా, థాయిలాండ్‌లో జరగనుంది. 2027లో బంగ్లాదేశ్‌, నేపాల్‌ దీనిని సంయుక్తంగా నిర్వహించనున్నాయి. మహిళల విభాగంలో ప్రతి గ్రూపు నుంచి 8 జట్లు నేరుగా అర్హత సాధిస్తాయి. 2023 టీ20 ప్రపంచకప్‌లో ఒక్కో గ్రూపు నుంచి టాప్‌ 3లో నిలిచిన జట్లు సహా ఆతిథ్య దేశమైన బంగ్లాదేశ్, 2023 ఫిబ్రవరి 27 టీ20 ర్యాంకింగ్స్‌లో స్థానం సంపాదించిన దేశాల జట్లు ఇందులో ఉంటాయి.

ABOUT THE AUTHOR

...view details