తెలంగాణ

telangana

ETV Bharat / sports

శ్రీలంక జట్టులో కరోనా కలకలం.. భారత్​తో సిరీస్ జరిగేనా? - శ్రీలంక క్రికెట్​ జట్టులో కరోనా

శ్రీలంక క్రికెట్​ జట్టులో కరోనా కలకలం రేపుతోంది. కేవలం 48 గంటల వ్యవధిలోనే కోచ్ గ్రాంట్​ ఫ్లవర్, డేటా ఎనలిస్ట్​ జీటీ. నిరోషన్​ల​కు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. దీంతో టీమ్​ఇండియాతో జరగాల్సిన వన్డే, టీ20 సిరీస్​ల నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

india srilanka series
భారత్​ శ్రీలంక సిరీస్​

By

Published : Jul 9, 2021, 5:02 PM IST

భారత్​- శ్రీలంక పరిమిత ఓవర్ల సిరీస్ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో లంక జట్టులో కరోనా కలకలం.. ఆటగాళ్లలో భయాన్ని రేకెత్తిస్తోంది. ఆ జట్టు డేటా ఎనలిస్ట్ జీటీ. నిరోషన్ కరోనా బారిన పడగా.. అంతకుముందు బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్​కు కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే జట్టులో ఇద్దరు సభ్యులు కరోనా బారిన పడటం వల్ల ఆటగాళ్లు భయాందోళనలో ఉన్నారు.

సిరీస్ జరిగేనా?

ఈ క్రమంలో జులై 13 నుంచి మొదలవాల్సిన భారత్- శ్రీలంక వన్డే సిరీస్ సజావుగా సాగుతుందా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోచ్ ఫ్లవర్ కొవిడ్ బారిన పడటం వల్ల ఆటగాళ్లు అభద్రతా భావానికి లోనవుతున్నారు.

ఫ్లవర్​, నిరోషన్​లు ప్రస్తుతం క్వారంటైన్​లో ఉండి.. చికిత్స పొందుతున్నట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు తెలిపింది.

ఇదీ చదవండి :

Rahul Dravid: ద్రవిడ్‌ టీమ్‌ఇండియా కోచ్​గా వద్దు!

India vs Sri Lanka: వీరు బరిలో దిగితే.. శతకాల మోతే!

ABOUT THE AUTHOR

...view details