తెలంగాణ

telangana

ETV Bharat / sports

కెప్టెన్​ రోహిత్​ సర్​ప్రైజ్​.. సిల్వర్​స్క్రీన్​ ఎంట్రీకి గ్రాండ్​గా ప్లాన్​.. హీరోయిన్​గా రష్మిక - mega blockbuster 4th sept

కెప్టెన్​ రోహిత్​శర్మ, బీసీసీఐ ప్రెసిడెంట్​ గంగూలీ, తమిళ హీరో కార్తి, నేషనల్​ క్రష్​ రష్మిక.. ఈ నలుగురు కలిసి ఫ్యాన్స్​ను సస్పెన్స్​లో పడేశారు. సెప్టెంబరు 4న ఓ బిగ్​ సర్​ప్రైజ్​ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇంతకీ అదేంటంటే.

sourav ganguly poster
Sourav Ganguly Rashmika Mandanna Rohit Sharma come together for Mega Blockbuster

By

Published : Sep 2, 2022, 11:20 AM IST

Updated : Sep 2, 2022, 11:46 AM IST

టీమ్​ఇండియా కెప్టెన్ రోహిత్​ శర్మ వెండితెర అరంగేట్రం చేయనున్నాడా? బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీతో కలిసి నటించబోతున్నాడా? కీలక పాత్రలో నేషనల్​ క్రష్​ రష్మిక, తమిళ స్టార్ హీరో కార్తి నటించబోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే ఈ నలుగురు కలిసి తమ ఇన్​స్టా ఖాతాల్లో ఒకే రకమైన పోస్ట్​ చేయడమే ఇందుకు కారణం.

ఈ ముగ్గురు కలిసి మెగాబ్లాక్​ బస్టర్​ అంటూ తమ ఫొటోలతో ఉన్న పోస్టర్లను పోస్ట్ చేశారు. సెప్టెంబర్​ 4న ట్రైలర్​ రిలీజ్​ అవ్వబోతున్నట్లు తెలిపారు. దీంతో అభిమానుల్లో ఉత్కంఠ మొదలైంది. ఈ నలుగురు కలిసి పాన్​ ఇండియా సినిమా చేయబోతున్నారా?, ఏదైనా ఓ స్పెషల్​ ప్రోగ్రామ్​లో పాల్గొన్నారా? రియాలిటీ షో ఏదైనా ప్లాన్​ చేశారా? లేదా యాడ్​లో నటించారా? అని అభిమానులు తెగ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

కాగా, ఇప్పటికే దాదా తన బయోపిక్​ను ప్రకటించారు. అయితే ఈ సినిమా ఇంకా సెట్స్​పైకి వెళ్లలేదు. ఒకవేళ ఈ బయోపిక్​ గురించే ఈ అప్డేట్​ ఇవ్వబోతున్నారా అనే అనుమానం కూడా ఫ్యాన్స్​కు కలుగుతోంది. ఏదేమైనప్పటికీ ఈ సస్పెన్స్​ వీడాలంటే ఆ ట్రైలర్​ విడుదలయ్యేవరకు వేచి ఉండాల్సిందే.

ఇవీ చదవండి:HBD Pawan Kalyan: పవర్​స్టార్​ మెచ్చిన పుస్తకాలు తెలుసా?

మౌనీ రాయ్, ఈశా​ హాట్​ అందాలు​.. నవ్వుతో మత్తెక్కిస్తున్న నేహా శర్మ

Last Updated : Sep 2, 2022, 11:46 AM IST

ABOUT THE AUTHOR

...view details