తెలంగాణ

telangana

By

Published : Dec 13, 2021, 12:27 PM IST

ETV Bharat / sports

టీ20 కెప్టెన్సీ వదులుకోవద్దని కోహ్లీని కోరా: గంగూలీ

Ganguly on Kohli Captaincy: వన్డే ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తప్పించడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ.. అతడో అద్భుతమైన క్రికెటర్ అని తెలిపాడు. కోహ్లీ కెప్టెన్సీని భారంగా భావించడం వల్లే తప్పుకొన్నట్లు వెల్లడించాడు.

ganguly on Virat Kohli, ganguly latest news, గంగూలీ లేటెస్ట్ న్యూస్, కోహ్లీ కెప్టెన్సీపై గంగూలీ
Virat Kohli

Ganguly on Kohli Captaincy: వన్డే ఫార్మాట్‌ కెప్టెన్సీ నుంచి విరాట్‌ కోహ్లీని తొలగించడంపై విమర్శలు చెలరేగడం వల్ల బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ మరోసారి స్పందించారు. ఆయన ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ తెరవెనుక ఏమి జరిగిందో వెల్లడించారు. వన్డే ఫార్మాట్‌ నుంచి కోహ్లీని ఎందుకు తప్పించాల్సి వచ్చిందో వివరించారు. విరాట్‌ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు పేర్కొన్నారు.

"నేను మీకో విషయం చెప్పాలనుకుంటున్నా. టీ20 ఫార్మాట్‌ కెప్టెన్సీని వదిలేయవద్దని నేను వ్యక్తిగతంగా విరాట్‌ను అభ్యర్థించా. కానీ.. ఆ బాధ్యతలను అతను భారంగా భావించాడు. అలా అనుకోవడం మంచిదే. అతడో అద్భుతమైన క్రికెటర్‌. ఆటతో మమేకమై ఉంటాడు. అతడు చాలా రోజుల పాటు కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించాక ఈ నిర్ణయానికి వచ్చాడు. నేను కూడా చాలా రోజులు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించాను. అందుకే నాకు ఆ కారణం తెలుసు. వారు (సెలక్టర్లు) తెల్లబంతి ఫార్మాట్‌కు ఒకే కెప్టెన్‌ ఉండాలనుకున్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకొన్నారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో నాకు తెలియదు. కానీ, ఒక్క విషయం చెప్పగలను. ఇదొక అద్భుతమైన జట్టు.. కొందరు ప్రతిభావంతులు కూడా ఉన్నారు. వారు ఏ లోటు రానీయరని ఆశిస్తున్నా."

-గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు

కోహ్లీ టీ20 ఫార్మాట్‌ కెప్టెన్సీ బాధ్యతలు వదులుకుంటున్నట్లు ప్రకటించిన సమయంలో మాట్లాడుతూ.. దాదాపు తొమ్మిదేళ్లుగా మూడు ఫార్మాట్లలో ఆడటం.. ఐదేళ్లకుపైగా నాయకత్వ బాధ్యతలతో ఒత్తిడి పెరిగిపోయిందని పేర్కొన్నాడు. తన కోసం కొంత సమయం వెచ్చించుకుని వన్డే, టెస్టు ఫార్మాట్లకు నాయకత్వం వహించేందుకు పూర్తిగా సంసిద్ధమై వస్తానని వెల్లడించాడు.

ఇవీ చూడండి: Ashes 2021: ఆసీస్​కు ఎదురుదెబ్బ.. గాయంతో స్టార్ పేసర్ దూరం

ABOUT THE AUTHOR

...view details