తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆ ఊహాగానాలపై దాదా క్లారిటీ.. ఇంతకీ ఏమన్నాడంటే? - సౌరవ్​ గంగూలీ వార్తలు

త్వరలోనే తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనున్నట్లు క్రికెట్​ దిగ్గజం సౌరవ్​ గంగూలీ బుధవారం చేసిన ట్వీట్​ చర్చనీయాంశంగా మారింది. దాదా పొలిటికల్​ ఎంట్రీ ఇస్తారంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దీనిపై క్లారిటీ ఇచ్చాడు గంగూలీ.

గంగూలీ
గంగూలీ

By

Published : Jun 2, 2022, 9:48 PM IST

Sourav ganguly education app: తాను కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నట్లుగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్​ గంగూలీ చేసిన ట్వీట్‌ సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, ఏదో కొత్త బాధ్యత తీసుకోనున్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. గంగూలీ పొలిటికల్‌ ఎంట్రీ ఇస్తాడని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. అవి కూడా ఈ ఊహాగానాలకు మరింత ఆజ్యం పోశాయి. అయితే, వాటికి తెరదించుతూ గంగూలీ గురువారం సామాజిక మాధ్యమాల్లో మరో పోస్ట్‌ పెట్టాడు. విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, కోచ్‌లకు మద్దతునిస్తూ వారి ఎదుగుదలకు తోడ్పడేందుకు ఆన్‌లైన్‌ టీచింగ్‌ యాప్‌ని తీసుకొస్తున్నట్లు గంగూలీ వెల్లడించాడు.

"నేను నిన్న చేసిన పోస్ట్ గురించి నాకు చాలా ప్రశ్నలు వస్తున్నాయి. సమాజానికి నిస్వార్థంగా సహాయం చేస్తున్న, రోజూ భారతదేశాన్ని గొప్పగా మార్చే వ్యక్తుల సమూహనికి ఏదైనా చేయాలని నేను కొంత కాలంగా ఆలోచిస్తున్నా. భారత టీ20 లీగ్‌ మాకు అద్భుతమైన ఆటగాళ్లను అందించింది. అయితే, నాకు స్ఫూర్తినిచ్చే అంశం ఏంటంటే.. ఈ ఆటగాళ్లందరి విజయానికి వారి కోచ్‌లు ఎంతో చెమట, రక్తాన్ని ధారపోశారు. ఇది క్రికెట్‌కు మాత్రమే కాకుండా.. విద్య, సంగీతం, ఫుట్‌బాల్ వంటి అన్ని రంగాలకు వర్తిస్తుంది. నేను ఈ రోజు స్థాయికి చేరటానికి కోచ్‌లే కారణం. వారిని పొందడం నా అదృష్టం."

-సౌరవ్​ గంగూలీ, బీసీసీఐ చీఫ్​

'నటులు, ఆటగాళ్లు, విజయవంతమైన సీఈవోలు చేసిన అసాధారణమైన సేవలను మనం చాలా ఏళ్లుగా కీర్తిస్తూనే ఉన్నాం. నిజమైన హీరోలను, వారి కోచ్‌లను, విద్యావేత్తలను మనం కీర్తించాల్సిన సమయం ఇది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోచ్‌లు, విద్యావేత్తలు, ఉపాధ్యాయులందరికీ నేను ఏదైనా చేయాలనుకుంటున్నా. ఈ రోజు నుంచి నేను వారి అంబాసిడర్‌గా ఉంటూ వారందరికీ మద్దతుగా చురుకుగా పని చేస్తా' అని దాదా పేర్కొన్నాడు.

ఇదీ చూడండి :IPL 2022: చర్చంతా కోహ్లీ, ఆర్సీబీ గురించే.. నెటిజన్ల రచ్చ రచ్చ!

ABOUT THE AUTHOR

...view details