Shubman Gill ODI Ranking :టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ 24 ఏళ్ల శుభ్‌మన్ గిల్.. కొంతకాలంగా కెరీర్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. ఫలితంగా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ప్రపంచంలోని మేటి బ్యాటర్లను సైతం వెనక్కినెట్టి.. 814 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక ఈ లిస్ట్‌లో పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ అజామ్ 857 రేటింగ్ పాయింట్లతో ప్రథమ స్థానంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే 2023 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే.. వన్డే ర్యాంకింగ్స్‌లో గిల్ కెరీర్ బెస్ట్ (ఫస్ట్ ప్లేస్) అందుకోడానికి ఛాన్స్ ఉంది. అదెలాగంటే
Australia Tour Of India 2023 :సెప్టెంబర్ 22 నుంచి భారత్.. ఆస్ట్రేలియాతో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఆ సిరీస్‌కు యంగ్ డైనమిక్ బ్యాటర్ గిల్ కూడా ఎంపికయ్యాడు. గిల్ ప్రస్తుత ఫామ్ చూస్తే.. అతడు ఎలాగైనా మూడు మ్యాచ్‌ల్లో తుది జట్టులో ఉండడం ఖాయం. అయితే ఆతడు ఈ మూడు మ్యాచ్‌ల్లో ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొని.. 200 పైచిలుకు పరుగులు సాధిస్తే, బాబర్ అజామ్‌ను వెనక్కి నెట్టి వన్డేల్లో నెం.1 ర్యాంక్ దక్కించుకోగలడు.
Shubman Gill Asia Cup 2023 :ఇటీవల ముగిసిన 2023 ఆసియా కప్ టోర్నమెంట్లో శుభ్‌మన్ గిల్.. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. 6 మ్యాచ్‌ల్లో కలిపి 75.50 సగటున 302 పరుగులు చేసి.. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో టాప్‌లో నిలిచాడు. అందులో ఓ సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.