Shubman Gill Captain :టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ప్రమోషన్ సాధించాడు. 2024 ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య.. ముంబయికి ట్రేడవడం వల్ల గిల్‌కు సారథ్య బాధ్యతలు అప్పజెప్పింది జట్టు యాజమాన్యం. ఈ విషయాన్ని అధికారికంగా ట్విట్టర్లో ప్రకటించింది.
"రానున్న ఐపీఎల్ సీజన్లో గుజరాత్ టైటాన్స్ జట్టును నడిపించేందుకు శుభ్‌మన్ గిల్ రెడీ. ఈ కొత్త జర్నీ స్టార్ట్ చేయనున్న గిల్‌కు శుభాకాంక్షలు" అని ట్విట్టర్లో పేర్కొంది. కెప్టెన్‌గా ప్రకటన అనంతరం గిల్.. " గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్ అవ్వడం గర్వంగా ఉంది. నాపై నమ్మకంతో కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన జట్టు యాజమాన్యానికి ధన్యవాదాలు. రెండు సీజన్లు ఆడిన అనుభవంతో జట్టును ముందుకు నడిపిస్తా" అని అన్నాడు.
Shubman Gill IPL Stats :గిల్ తన ఐపీఎల్ కెరీర్లో 33 ఇన్నింగ్స్‌ల్లోనే 1373 పరుగులు 47.34 చేశాడు. అందులో మూడు సెంచరీలు, ఎనిమిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక గత సీజన్లోనే 17 మ్యాచ్‌ల్లో గిల్ 890 పరుగులు బాది.. టోర్నీలోనే అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. ఇక ప్లేఆఫ్స్‌లో ముంబయి ఇండియన్స్‌పై గిల్.. 60 బంతుల్లో 129 పరుగులు బాది గుజరాత్ గెలుపులో కీలకంగా మారాడు.