Shreyas Iyer stunning fielding: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో టీమ్ఇండియా 68 పరుగుల తేడాతో గెలిచి 1-0 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. బ్యాటింగ్, బౌలింగ్ సహా ఫీల్డింగ్‌లో భారత క్రికెటర్లు చురుగ్గా వ్యవహరించారు. దినేశ్ కార్తిక్ ఫినిషర్‌గా అదరగొడితే.. కెప్టెన్ రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. అయితే వీటన్నింటిని మించి శ్రేయాస్ అయ్యర్ చేసిన ఫీల్డింగ్ విన్యాసం విపరీతంగా ఆకట్టుకుంది. విండీస్ ఇన్నింగ్స్‌లో ఆ జట్టు సారథి నికోలస్ పూరన్ బ్యాటింగ్ చేస్తుండగా అశ్విన్ వేసిన బంతిని సిక్సర్‌గా మలిచేందుకు భారీ షాట్ కొట్టాడు. అది సిక్స్ అని అందరూ భావించారు. అయితే బౌండరీ లైన్ వద్ద ఉన్న శ్రేయస్ ఎంతో తెలివిగా వ్యవహరించి ఆ బంతిని అడ్డుకున్నాడు. క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించి చివరికి బంతిని మైదానం లోపలికి తోసేశాడు. దీంతో పూరన్ కేవలం రెండు పరుగులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి శ్రేయస్ ఫీల్డింగ్ ఫీట్‌ను మీరూ చూసేయండి..
శ్రేయస్ అద్భుత విన్యాసం.. గాల్లోకి ఎగిరి మరీ.. - శ్రేయస్ అయ్యర్
Shreyas Iyer stunning fielding: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో టీమ్ఇండియా ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ చేసిన ఫీల్డింగ్ విన్యాసం అదిరిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా, టీ20 ప్రపంచకప్‌లో ఆడాలంటే జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలి. దాని కోసం ఆటగాళ్లు తమ నైపుణ్యాలకు పదునుపెట్టి.. ప్రతి మ్యాచ్‌లోనూ అద్భుతంగా రాణించాల్సి ఉంటుంది. ఇప్పుడసలే టీమ్‌ఇండియాలో స్థానం కోసం విపరీతమైన పోటీ నెలకొని ఉంది. ఏ చిన్న అవకాశం వచ్చినా.. ఒడిసిపట్టుకోవడానికి ఆటగాళ్లు సిద్ధంగా ఉంటున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ సహా ఫీల్డింగ్‌లోనూ మంచి ప్రదర్శన చేసిన వారే ప్రపంచకప్ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. అందుకే ప్రతి ఆటగాడు సర్వశక్తులూ ఒడ్డుతున్నాడు. ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్.. తన ఆటకు పదును పెట్టే క్రమంలోనే ఈ ఫీల్డింగ్ ఫీట్ చేశాడు.
ఇదీ చూడండి: దాదా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మళ్లీ బ్యాట్ పట్టనున్న డాషింగ్ క్రికెటర్!