Shikar Dhawan: భారత డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ సోషల్ మీడియాలో చురుకుగా ఉంటాడు. వీలు చిక్కినప్పుడల్లా వీడియోలతో అభిమానుల్ని ఉర్రూతలూగిస్తాడు. తాజాగా ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ యువతి చేస్తున్న డ్యాన్స్‌ను అనుకరిస్తూ శిఖర్ చేసిన డాన్స్, హావభావాలు అభిమానుల్ని కడుపుబ్బా నవ్విస్తున్నాయి. వాష్‌రూంకు అత్యవసరంగా వెళ్లాల్సినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందని ధావన్ ఫన్నీగా ఈ వీడియో చేశాడు.
'ఈ పోరాటం నిజమైనది దీనికోసం గట్టిగా ప్రయత్నించాలి' అంటూ శిఖర్ పోస్ట్ చేశాడు. ధావన్ పోస్ట్ చేసిన ఈ ఫన్నీ వీడియోపై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్‌లతో పాటు పలువురు సెలెబ్రటీలు స్పందించారు.