Shane Warne: ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఆస్ట్రేలియాలోని ప్రఖ్యాత మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఈ కార్యక్రమాన్ని జరపనున్నారు. ఈ అంతిమ సంస్కారాలకు దాదాపు లక్ష మందికి పైగా అభిమానులు హాజరుకానున్నట్లు తెలిసింది.
ధాయ్లాండ్లోని షేన్ వార్న్ భౌతికకాయాన్ని ఆస్ట్రేలియాకు తీసుకురానున్నారు. అనంతరం కుటుంబ సభ్యులు, అభిమానులు మెల్బోర్న్లో సమావేశం కానున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ నెలాఖరున సంతాప కార్యక్రమాలు నిర్వహిస్తారని, వాటి ప్రణాళికలు ఖరారు అవుతున్నట్లు పేర్కొంది.