విరాట్ కోహ్లీ భవిష్యత్తుపై పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ భవిష్యత్తు అతడి చేతుల్లోనే ఉందని పేర్కొన్నాడు. ట్విటర్లో అభిమానులతో ముచ్చటించిన అతడు.. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని విరాట్ భవిష్యత్తు ఏమిటని ప్రశ్నించగా... అఫ్రిది తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. 'అది అతడి చేతుల్లోనే ఉంది' అని బదులిచ్చాడు.
కోహ్లీ ఫామ్‌పై పాక్ మాజీ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు - కోహ్లీ ఫామ్‌పై పాక్ మాజీ కెప్టెన్
ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న టీమ్ఇండియా మాజీ కెప్టెన్ కోహ్లీ పై పాక్ మాజీ సారథి షాహిద్ అఫ్రిది కీలక వ్యాఖ్యలు చేశాడు. ఏమన్నాడంటే..
కోహ్లీ దాదాపు ఐదు వారాల విశ్రాంతి తర్వాత తిరిగి మైదానంలోకి దిగుతున్నాడు. ఈ క్రమంలో 28న తొలి మ్యాచ్ పాకిస్థాన్‌తో ఆడనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ శతకం చేసి 1,000 రోజులు దాటిపోయింది. ఇదే విషయాన్ని ఓ అభిమాని అఫ్రిది వద్ద ప్రస్తావించాడు. దీనికి అఫ్రిది స్పందిస్తూ.. "పెద్ద ఆటగాళ్ల సత్తా కష్టకాలంలోనే తెలుస్తుంది" అని వ్యాఖ్యానించాడు. టీ20 ఫార్మాట్‌లో పాకిస్థాన్‌పై విరాట్‌కు మంచి రికార్డు ఉంది. అతడు 77.75 సగటుతో 311 పరుగులు చేశాడు. మూడు సార్లు నాటౌట్‌గా నిలిచాడు. ఈ పరుగుల్లో 35 ఫోర్లు, ఐదు సిక్స్‌లు ఉన్నాయి. వెస్టిండీస్, జింబాబ్వే పర్యటనలకు విశ్రాంతి తీసుకొన్న కోహ్లీ రెట్టింపు ఉత్సాహంతో ఆసియాకప్‌లో రాణిస్తాడని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది.
ఇదీ చూడండి: ప్రపంచ ఛాంపియన్‌కు మళ్లీ షాకిచ్చిన ప్రజ్ఞానంద్