తెలంగాణ

telangana

ETV Bharat / sports

అతడే బెస్ట్ కెప్టెన్.. బాబర్ కాదు: షాహీన్ కీలక వ్యాఖ్యలు - షాహీన్ అఫ్రిది బాబర్ అజామ్ కెప్టెన్స

Babar Azam Shaheen Afridi: పాకిస్థాన్ యువ పేసర్ షాహీన్ అఫ్రిది కెప్టెన్ బాబర్ అజామ్​పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అజామ్ కంటే ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్​ గొప్ప కెప్టెన్​ అంటూ కితాబిచ్చాడు.

Shaheen Afridi on Babar Azam captaincy, Shaheen Afridi Rizwan, షాహీన్ అఫ్రిది బాబర్ అజామ్ కెప్టెన్సీ, షాహీన్ అఫ్రిది మహ్మద్ రిజ్వాన్ కెప్టెన్సీ
shaheen afridi

By

Published : Dec 22, 2021, 12:14 PM IST

Babar Azam Shaheen Afridi: ప్రస్తుత పాకిస్థాన్ జట్టును ముందుండి నడిపిస్తూ యువ ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపుతున్నాడు బాబర్ అజామ్. ఇతడి కెప్టెన్సీలో జట్టు గొప్పగా రాణిస్తోంది. అనతికాలంలోనే తన సారథ్యంతో అందరి ప్రశంసలు అందుకున్నాడు. అలాంటి అజామ్​ను ఉత్తమ కెప్టెన్ కాదంటూ బాంబు పేల్చాడు ఆ జట్టు స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిది. బాబర్ కంటే ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ అత్యుత్తమ కెప్టెన్ అని కితాబిచ్చాడు. అయితే ఇప్పటివరకు జాతీయ జట్టుకు రిజ్వాన్ సారథ్యం వహించలేదు.

"నాకు రిజ్వాన్ అంటే వ్యక్తిగతంగా చాలా ఇష్టం. దేశవాళీ టోర్నీల్లో మొదటగా అతడి సారథ్యంలోనే ఆడాను. అతడు చాలా గొప్ప సారథి. జాతీయ జట్టును ప్రస్తుతం బాబర్ అద్భుతంగా నడిపిస్తున్నాడు. ఇతడి కెప్టెన్సీలో మా జట్టు కొత్త శిఖరాలకు చేరుకుంది. కానీ అతడికి కెప్టెన్సీ పరంగా నేను రెండో ర్యాంకు ఇస్తా. బ్యాటింగ్​లో అజామ్​కు తిరుగులేదు. అతడో నెంబర్​వన్ బ్యాటర్."

-షాహీన్ అఫ్రిది, పాక్ పేసర్

ఇటీవలే పాకిస్థాన్​ సూపర్ లీగ్​లోని లాహోర్ ఖలందర్​ జట్టుకు కెప్టెన్​గా ఎంపికయ్యాడు షాహీన్ అఫ్రిది. జట్టును వచ్చే సీజన్​లో విజేతగా నిలిపేందుకు కృషి చేస్తానని తెలిపాడు.

ఇవీ చూడండి: సఫారీతో సిరీస్​లో భారత్​కు కలిసొచ్చేది అదే: జహీర్

ABOUT THE AUTHOR

...view details