తెలంగాణ

telangana

By

Published : Jul 21, 2022, 8:53 PM IST

ETV Bharat / sports

బీసీసీఐ పిటిషన్‌పై కొత్త అమికస్‌ క్యూరీని నియమించిన సుప్రీంకోర్టు

బీసీసీఐ ఆఫీస్‌ బేరర్ల పదవీ కాలానికి సంబంధించిన పిటిషన్​పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త అమికస్‌ క్యూరీని నియమించి.. జులై 28న విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది.

SC appoints senior advocate Maninder Singh as amicus in BCCI matter, to hear on July 28
బీసీసీఐ పిటిషన్‌పై కొత్త అమికస్‌ క్యూరీని నియమించిన సుప్రీంకోర్టు

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి సంబంధించిన వ్యవహారంలో సుప్రీంకోర్టు గురువారం సీనియర్ న్యాయవాది మణిందర్ సింగ్‌ను అమికస్ క్యూరీగా నియమించింది. బీసీసీఐ ఆఫీస్‌ బేరర్ల పదవీ కాలానికి సంబంధించి రాజ్యాంగ సవరణ కోరుతూ బీసీసీఐ గతంలో వేసిన పిటిషన్‌ను చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని జస్టిస్‌ కృష్ణ మురారి, జస్టిస్‌ హిమా కోహ్లీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈరోజు విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా వారు అమికస్ క్యూరీని నియమించి.. విచారణను జులై 28న చేపడతామని తెలిపారు. ఇంతకుముందు అమికస్‌ క్యూరీగా ఉన్న పీఎస్ నరసింహ ఇప్పుడు న్యాయమూర్తిగా పదోన్నతి చెందిన నేపథ్యంలో మణిందర్ సింగ్‌ను కొత్తగా నియమించారు.

రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్లు, బీసీసీఐలోని ఆఫీస్ బేరర్ల పదవీకాలాల మధ్య తప్పనిసరిగా ఉన్న కూలింగ్-ఆఫ్ పీరియడ్‌ వ్యవధిని తొలగించాలని, అందుకు సంబంధించి రాజ్యాంగ సవరణ చేయాలని బీసీసీఐ తమ పిటిషన్‌లో కోరింది. కాగా, గతంలో జస్టిస్ ఆర్‌ఎం లోధా నేతృత్వంలోని కమిటీ సిఫార్సుల మేరకు బీసీసీఐలో పలు సంస్కరణలకు చేయగా.. సుప్రీంకోర్టు వాటిని అంగీకరించింది. దీంతో రాష్ట్ర క్రికెట్ సంఘం లేదా బీసీసీఐ స్థాయిలో ఆఫీస్ బేరర్‌లకు ఆరేళ్ల పదవీకాలం ముగిసిన తర్వాత మూడేళ్ల కూలింగ్-ఆఫ్ పీరియడ్‌ కచ్చితంగా ఉండాల్సిందే. అయితే.. గంగూలీ, జైషా ఇదివరకే బెంగాల్‌, గుజరాత్‌ క్రికెట్‌ సంఘాల్లో పనిచేయడంతో ఆ నిబంధన ఇప్పుడు వారికి అడ్డుగా మారింది. ఈ నేపథ్యంలోనే కూలింగ్-ఆఫ్ పీరియడ్‌ను రద్దు చేయాలని బీసీసీఐ కోరింది.

ఇదీ చదవండి:Commonwealth Games: సింధు పసిడి కల నెరవేరేనా? 'మిక్స్‌డ్' టైటిల్ భారత్​​ నిలబెట్టుకునేనా?

ABOUT THE AUTHOR

...view details