SAI shut down: కరోనా మహమ్మారి తీవ్రతతో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్) క్రీడ శిక్షణ కేంద్రాల (ఎస్‌టీసీ)ను మూసివేస్తున్నట్లు సాయ్ ప్రకటించింది. అగ్రశ్రేణి క్రీడాకారులు శిక్షణ తీసుకుంటున్న పటియాలా, బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లకు ఇందుకు మినహాయింపు ఇచ్చింది. ఈ రెండు కేంద్రాలు యధావిధిగా కొనసాగుతాయని తెలిపింది.
కరోనా విజృంభణ.. సాయ్ కేంద్రాల మూసివేత - భారత క్రీడాప్రాధికార సంస్థ మూసివేత కరోనా
SAI shut down: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్) క్రీడ శిక్షణ కేంద్రాల (ఎస్‌టీసీ)ను మూసివేస్తున్నట్లు సాయ్ ప్రకటించింది. పటియాలా, బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లకు ఇందుకు మినహాయింపు ఇచ్చింది.
SAI news
"కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న 67 సాయ్ శిక్షణ కేంద్రాల్ని మూసేయాలని నిర్ణయించాం. క్రీడాకారుల భద్రత దృష్ట్యా వివిధ రాష్ట్రాలు క్రీడల కార్యకలాపాల్ని నిలిపివేయడం కూడా ఇందుకు ఓ కారణమే. ఈ ఏడాది జరిగే ఆసియా, కామన్వెల్త్ క్రీడలకు సిద్ధమవుతున్న అగ్రశ్రేణి క్రీడాకారుల సాధన యధావిధిగా కొనసాగుతుంది. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లలో బయో బబుల్ వాతావరణంలో వారు శిక్షణ తీసుకుంటారు" అని సాయ్ పేర్కొంది.