టీమ్ఇండియా-ఇంగ్లాండ్ మ్యాచ్ సందర్భంగా ిటీవలే మహిళా క్రికెటర్ దీప్తి శర్మ చేసిన రనౌట్ చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ విషయంలో ఆమెకు పలువురు మద్దతు ఇవ్వగా మరికొందరు విమర్శించారు. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ మరోసారి స్పందించాడు. ఇంగ్లాండ్ బ్యాటర్ ఛార్లీ డీన్‌ను రనౌట్ చేయడంలో దీప్తి శర్మ ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశాడు. క్రీడా స్ఫూర్తిపై అడిగిన ప్రశ్నకు సచిన్ ఈ సమాధానం ఇచ్చాడు. నియమ నిబంధనల ప్రకారం ఎలా ఆడినా క్రీడా స్ఫూర్తిగానే చూడాలని చెప్పాడు.
ఆ మహిళా క్రికెటర్‌పై సచిన్ కామెంట్స్.. ఆమె చేసింది కరెక్టేనంటూ - దీప్తి శర్మ రనౌట్ సచిన్
దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్.. మహిళా క్రికెటర్ దీప్తి శర్మ చేసిన రనౌట్ అంశంపై మాట్లాడాడు. ఏం అన్నాడంటే..
"నాన్‌స్ట్రైకర్ క్రీజ్ నుంచి బయటకొచ్చినప్పుడు ఐసీసీ నియమం ప్రకారం రనౌట్ కావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు అది రూల్. స్ట్రైకింగ్ చేస్తున్న బ్యాటర్ ఎల్బీడబ్ల్యూగా ఎలా పెవిలియన్‌కు చేరతాడో.. అలానే నాన్‌స్ట్రైకింగ్ ప్లేయర్ కూడా క్రీజ్‌లో లేకపోతే ఇలా రనౌట్‌గా ఔటయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఎలాంటి వివాదాలు రాకూడదని ఐసీసీ కొత్త రూల్‌ను పరిచయం చేసింది. బంతి పడకముందే క్రీజ్‌ను దాటి ముందుకొస్తే తప్పకుండా రనౌట్ అవుతారు. ఇక ఆ మ్యాచ్‌లో దీప్తి శర్మ ఐసీసీ నిబంధనల ప్రకారమే ఆడింది" అని సచిన్ వెల్లడించాడు.
ఇదీ చూడండి:టీ20 ప్రపంచకప్‌లో కొత్త టెక్నాలజీ.. ఇక ఫీల్డర్స్‌ను కనుక్కోవడం వెరీ ఈజీ