సాధారణంగా సెలబ్రిటీలకు కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో ఎంజాయ్ చేసే సమయం కాస్త తక్కువగా ఉంటుంది. అందుకే విరామ సమయం దొరికితే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తమకిష్టమైన పనులు చేస్తూ ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్‌తో సరదాగా గడిపేస్తుంటారు. అలాంటి వారిలో దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ ఒకరు.
గోవా బీచ్‌లో సచిన్ సందడి.. మత్స్యకారులతో కలిసి చేపలు పడుతూ.. - చేపలు పట్టిన సచిన్ తెందుల్కర్
దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ తన కుమారుడు అర్జున్‌తో కలిసి బీచ్‌లో సరదాగా గడిపారు. అక్కడి మత్య్సకారులతో కలిసి చాపలు పట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
ఆయన తాజాగా తన కుమారుడు అర్జున్‌తో కలిసి గోవా బీచ్‌కు వెళ్లిన అక్కడి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ క్రమంలో ఆ బీచ్‌లోని మత్య్సకారులతో కలిసి కాసేపు సరదాగా ముచ్చటించారు. చేపలు పట్టే విధానంపై మెళుకువలు అడిగి తెలుసుకున్నారు. అలాగే.. సముద్రం నుంచి మత్స్యకారుల బోటును ఒడ్డుకు లాగేందుకు వారికి సాయం చేశారు. అనంతరం బీచ్ ఒడ్డున ఉన్న ఓ రెస్టారెంట్‌లో చేపలను ఫ్రై చేయించుకుని కుమారుడితో కలిసి తింటూ ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను మాస్టర్ తన ఇన్‌స్టాలో పోస్టు చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు సచిన్ సింప్లిసిటీని మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇదీ చూడండి:ఇదా.. హార్దిక్ పాండ్య ఫిట్నెస్ మంత్ర?