ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు అత్యుత్తమ జట్టుగా ఎదగాలని క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ అభిప్రాయపడ్డాడు. శనివారం దక్షిణాఫ్రికాలో జరగనున్న ఐసీసీ మహిళా ప్రపంచ కప్ ఈవెంట్లో పాల్గొనే 15 మంది అండర్ 19 క్రీడాకారిణులను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. కాగా ఈ టీమ్‌లో సీనియర్ ప్లేయర్స్ షఫాలి వర్మతో పాటు రిచా ఘోష్‌లు ఉన్నారు.
'మన టాలెంట్‌ను చూపించడానికి ఇదే బెస్ట్ ఛాన్స్'.. అమ్మాయిలకు సచిన్ సలహా! - సచిన్ తెందుల్కర్ ఐసీసీ కాలమ్
భారత మహిళల జట్టు ఎప్పటికీ అత్యుత్తమ జట్టుగా ఎదగాలని స్టార్ క్రికెట్ ప్లేయర్ సచిన్ తెందుల్కర్ అభిప్రాయపడ్డారు. శనివారం దక్షిణాఫ్రికాలో జరగనున్న మహిళల క్రికెట్ ప్రపంచ కప్ అండర్-19 ఈవెంట్ జరగనున్న సందర్భంగా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు.
"మహిళల జట్టు ఈసారి అత్యుత్తమ జట్టుగా ఉండగల సామర్థ్యాన్ని కలిగి ఉందని నేను విశ్వసిస్తాను"..బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ సత్తా ఉన్న అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో పాటు యువ ప్రతిభావంతులు సైతం జట్టులో ఉన్నందున టీమ్ మరింత బలపడింది " అని సచిన్ ఐసీసీకు చెందిన ఓ కాలమ్‌లో పేర్కొన్నారు. "మహిళల క్రికెట్ భారీ పురోగతి సాధించినప్పటికీ, ఇంకా మెరుగుపడాల్సిన అంశాలున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మరింత పటిష్టమైన బీజం పడాల్సిన అవసరం ఎంతో ఉంది . మనం ఎంత పెద్దగా పునాదిని విస్తరింపజేస్తామో, అంత ఎక్కువ ప్రతిభను వెలికితీయగలం. ఇది గేమ్ నాణ్యతపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది" అని అన్నారు.
"మొదటి టోర్నమెంట్‌లోనే అది జరుగుతుందని నేను భావిస్తున్నాను. మన దగ్గరున్న అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించడానికి ఇదే సరైన అవకాశం. దీని వల్ల వివిధ దేశాలు జూనియర్ క్రికెట్ టీమ్‌పై మరింత ఆసక్తి కనబరుస్తారు. ఫలితంగా భవిష్యత్తులో అండర్19 ప్రపంచ కప్‌లు అలాగే సీనియర్ క్రికెట్లకు స్థిరమైన ఫీడర్ లైన్ ఉంటుంది" అని సచిన్ తెలిపారు.