Ruturaj Gaikwad Asian Games :టీమ్ఇండియా యంగ్ బ్యాటర్రుతురాజ్ గైక్వాడ్.. ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో వైస్‌కెప్టెన్ హోదాలో అదరగొట్టాడు. ఐపీఎల్‌లోనూ సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ స్టార్ ప్లేయర్.. రానున్న ఆసియా క్రీడల్లో భారత జట్టుకు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఈ క్రమంలో అతడు తాజాగా కెప్టెన్సీ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఇంతకీ గైక్వాడ్ ఏమన్నాడంటే..
Ruturaj Gaikwad On Dhoni : ఐపీఎల్లో ఆడుతున్నప్పుడు ఎం.ఎస్ ధోనీ.. తనకు సలహాలు ఇచ్చేవాడని రుతురాజ్ అన్నాడు. ఎప్పుడూ ఆటపై శ్రద్ధ పెట్టాలని ధోనీ సూచించేవాడంటూ తెలిపాడు. భవిష్యత్తు గురించి అస్సలు చింతించే అవసరం లేదని.. మన పని చేసుకుంటూ పోవాలని ధోనీ అనేవాడని తెలిపాడు. ఇక కెప్టెన్ అనేవాడు.. జట్టులోని ప్లేయర్లందరికీ ఆత్మవిశ్వాసాన్ని అందించాలని.. వారు ఏమనుకుంటున్నారో, వారి అభిప్రాయాలేంటో తప్పకుండా తెలియాలని, వారిపై నాయకుడు విశ్వాసం ఉంచాలంటూ రుతురాజ్ అభిప్రాయపడ్డాడు.
మరోవైపు రుతురాజ్ ఇప్పటికే డొమెస్టిక్ క్రికెట్లో పలు లీగ్‌ల్లో ఆయా జట్లకు నాయకత్వం వహిస్తున్నాడు. మహారాష్ట్ర స్థానిక టీ20 లీగ్‌లో పుణె జట్టుకు రుతురాజ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఇంత చిన్న వయసులో (26) ఆసియా క్రీడల్లో టీమ్ఇండియాకు నాయకత్వం వహించే అవకాశం రుతురాజ్‌కు దక్కింది. దీంతో ఐపీఎల్లో సైతం అతడికి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పగ్గాలు అప్పజెప్పే అవకాశాలు ఉన్నాయంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.