తెలంగాణ

telangana

ETV Bharat / sports

రోహిత్ శర్మ @15 ఇయర్స్​.. ఆ రికార్డులు హిట్​మ్యాన్​కే సొంతం - రోహిత్ శర్మ లేఖ

rohit sharma news: అంతర్జాతీయ క్రికెట్​లో ప్రవేశించి 15 ఏళ్లు పూర్తైన సందర్భంగా అభిమానులకు లేఖను విడుదల చేశారు కెప్టెన్​ రోహిత్​ శర్మ. ఈ ప్రయాణంలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ జర్నీని తన జీవితమంతా గుర్తుంచుకుంటానన్నారు.

rohit sharma news
rohit sharma news

By

Published : Jun 23, 2022, 1:34 PM IST

rohit sharma news: భారత్​ తరఫున అంతర్జాతీయ క్రికెట్​లో అడుగుపెట్టి 15 వసంతాలు పూర్తైన సందర్భంగా కెప్టెన్ రోహిత్​ శర్మ భావోద్వేగ లేఖను పోస్ట్​ చేశారు. ఈ ప్రయాణంలో తనకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికి ధన్యావాదాలు తెలిపారు. జీవితమంతా ఈ జర్నీని గుర్తుంచుకుంటాన్నారు. జూన్​ 23, 2007న ఐర్లాండ్​తో జరిగిన వన్డే మ్యాచ్​తో హిట్​మ్యాన్​ అరంగేట్రం చేశారు. '15 ఇయర్స్​ ఇన్ మై ఫేవరెట్ జెర్సీ' అంటూ సోషల్​మీడియా వేదికగా లేఖను విడుదల చేశారు.

"ఈ రోజుతో భారత్​ తరఫున అంతర్జాతీయ క్రికెట్​లో అడుగుపెట్టి 15 ఏళ్లు పూర్తిచేసుకున్నాను. ఈ ప్రయాణం అద్భుతమైనది. జీవితాంతం ఈ జర్నీ ఓ జ్ఞాపకంలా మిగిలిపోతుంది. నా ప్రయాణంలో భాగం పంచుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నాకు సహకారం అందించిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మీ వల్లే ఓ ఆటగాడిగా ఈ స్థానంలో ఉన్నాను. క్రికెట్​ ప్రేమికులు, అభిమానులు, విమర్శకుల ప్రేమ వల్లే ఎన్నో అవరోధాలు దాటాను"

- రోహిత్ శర్మ, భారత కెప్టెన్

35 ఏళ్ల రోహిత్​శర్మ.. ఇప్పటివరకు తన కెరీర్​లో ఎన్నో రికార్డులను సాధించారు. 2014లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్​లో 264 పరుగులు చేసి.. అంతర్జాతీయ క్రికెట్​లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డుకెక్కారు. వన్డేల్లో మూడు డబుల్​ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా ఘనత సాధించారు. 2019 ప్రపంచకప్​లో ఏకంగా ఐదు సెంచరీలు చేసి రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకు ​ 228 వన్డే మ్యాచులాడిన రోహిత్​శర్మ.. 9,823 పరుగులు చేశారు. 124 టీ20ల్లో 3,308, 44 టెస్టుల్లో 3,706 పరుగులు సాధించారు. గతేడాది విరాట్ కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించడం వల్ల అన్ని ఫార్మాట్లలో నాయకత్వ బాధ్యతలు అందుకున్నారు రోహిత్​ శర్మ. తాజాగా దక్షిణాఫ్రికాతో సిరీస్​కు విశ్రాంతి ​ఇవ్వగా.. ఇంగ్లాండ్​తో జరగునున్న ఐదో టెస్టులో బరిలోకి దిగనున్నారు.

ఇదీ చదవండి:భారత్​-ఇంగ్లాండ్​ సిరీస్​.. అప్పుడేమైందంటే?

ABOUT THE AUTHOR

...view details