Rohit Sharma On CapeTown Pitch :కేట్టౌన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది టీమ్ఇండియా. 7 వికెట్ల తేడాతో సఫారీలపై ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో అనేక రికార్డులు బద్దలయ్యాయి. పేస్‌కు ఈ పిచ్ విపరీతంగా అనకూలించింది. ఈ విషయంపై టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. భారత్‌లోని పిచ్‌ల గురించి మాట్లాడకుండా ఉంటే కేప్‌టౌన్ పిచ్‌పై ఆడేందుకు తనకేమీ ఇబ్బంది ఉండదని అన్నాడు. భారత్ పిచ్‌ల గురించి మాడ్లాడే విషయంలో నోరు మూసుకోవాలని అసహనం వ్యక్తం చేశాడు.
'ఈ టెస్టులో ఏం జరిగిందో, పిచ్ ఎలా ప్రవర్తించిందో అందరూ చూశారు. ఇండియాకు వెళ్లినప్పుడు అక్కడి పిచ్‌ల గురించి మాట్లాడే విషయంలో నోరు మూసుకుని ఉంటే, ఇలాంటి పిచ్‌పై ఆడేందుకు నిజంగానే నాకెలాంటి ఇబ్బంది ఉండదు. ఈ పిచ్ చాలా ప్రమాదకరంగా ఉంది. మాకు పెద్ద సవాలు విసిరింది. భారత్ పిచ్‌లపై కూడా ఇలాంటి సవాలే ఉంటుంది. మేము టెస్టు క్రికెట్ ఆడేందుకు వచ్చాం. పిత్ ఎలా ఉన్నా ఆడాలి. కానీ భారత్‌లో తొలి రోజు నుంచే స్పిన్ తిరిగితే అప్పుడందరూ ఏదేదో మాట్లాడతారు. మొదటి రోజు నుంచి బంతి సీమ్ అయితే పర్వాలేదు. కానీ బంతి తిరిగితే మాత్రం ఒప్పుకోరా? ఈ విషయంలో తటస్థంగా ఉండాలి. పిచ్‌లకు రేటింగ్ ఇచ్చేటప్పుడు రిఫరీలు కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి' అని రోహిత్ శర్మ చెప్పాడు.