Rohit Sharma Mumbai Indians :ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ హార్దిక్ పాండ్యకు కెప్టెన్సీ అప్పగించిన తర్వాత, రోహిత్ శర్మను ఉద్దేశించి ట్విట్టర్లో పోస్ట్ షేర్ చేసింది. రోహిత్ పేరు ముంబయి ఇండియన్స్ చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొంది. '2013లో నువ్వు నాయకత్వ బాధ్యతలు తీసుకొని నాపై నమ్మకం ఉంచమని కోరావు. గెలుపు, ఓటముల్లో ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలన్నావు. ఈ పదేళ్లలో ఆరు టోఫ్రీలు (5 ఐపీఎల్, 1 ఛాంపియన్స్ లీగ్) అందించావు. ఎప్పటికీ నువ్వు మా కెప్టెన్‌వే. ముంబయి ఇండియన్స్‌పై నీ ముద్ర చెరగనిది. థాంక్యూ, కెప్టెన్ రోహిత్. ముంబయి కా రాజా' అంటూ ఎమోషనల్‌గా రాసుకొచ్చింది.
'ముంబయిపై నీ ముద్ర చెరగనిది- ఎప్పటికీ నువ్వే మా కెప్టెన్' - rohit sharma ipl captaincy
Rohit Sharma Mumbai Indians : ముంబయి ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలు హార్దిక్‌కు అప్పగించిన నేపథ్యలో, జట్టుకు రోహిత్ అందించిన సేవలు అసాధారణం అని ఫ్రాంచైజీ ట్వీట్ చేసింది.
Published : Dec 15, 2023, 9:37 PM IST
|Updated : Dec 15, 2023, 10:50 PM IST
Rohit Sharma IPL Winning Streak: కాగా, 2013 సీజన్ మధ్యలో రోహిత్ కెప్టెన్సీ అందుకున్నాడు. అప్పటికి ఐదేళ్లుగా క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్, హర్భజన్ సింగ్, ఆస్ట్రేలియా వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ రికీ పాంటింగ్‌కు సాధ్యం కాని ఐపీఎల్ టైటిల్‌ను ముంబయికి రోహిత్ అందించాడు. ఆ తర్వాత కెప్టెన్‌గా అనేక రికార్డులు అందుకున్నాడు రోహిత్. అతడు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన రెండో కెప్టెన్‌గా నిలిచాడు. రోహిత్ కెప్టెన్సీలో 158 మ్యాచ్‌ల్లో 87 సార్లు ముంబయి ఇండియన్స్ నెగ్గింది. అంటే రోహిత్ విన్నింగ్ పర్సెంటేజీ 55.06గా ఉంది. అతడి కంటే ముందు మహేంద్రసింగ్ ధోనీ మాత్రమే ఉన్నాడు. ధోనీ 58.84 విన్నింగ్ పర్సెంటేజీతో 226 మ్యాచ్‌ల్లో 133 సార్లు చెన్నై సూపర్ కింగ్స్ జట్టును విజేతగా నిలిపాడు.
Rohit Sharma IPL Titles : ఏ కెప్టెన్‌కు సాధ్యంకాని విధంగా రోహిత్, ముంబయిని 5సార్లు ఛాంపియన్‌గా నిలిపాడు. ఈ క్రమంలో ఐపీఎల్లో ఐదు టైటిళ్లు (2013, 2015, 2017, 2019, 2020) సాధించిన తొలి కెప్టెన్‌గా నిలిచాడు. ఇక ముంబయి ఇండియన్స్ యాజమాన్యం నిర్ణయం పట్ల రోహిత్ ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురవుతున్నారు. రోహిత్‌కు దక్కాల్సిన గౌరవం ఇది కాదంటూ సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తున్నారు.