తెలంగాణ

telangana

ETV Bharat / sports

రోహిత్​ శర్మకు గాయం.. దక్షిణాఫ్రికా టెస్ట్​ సిరీస్​కు దూరం - ind vs sa schedule

rohit sharma injured
rohit sharma injured

By

Published : Dec 13, 2021, 6:25 PM IST

Updated : Dec 13, 2021, 7:15 PM IST

18:21 December 13

రోహిత్​ శర్మ చేతికి గాయం

Rohit Sharma Injured: నెట్​ సెషన్​లో ప్రాక్టీస్​ సందర్భంగా టీమ్​ఇండియా టెస్ట్​ వైస్ కెప్టెన్​ రోహిత్​ శర్మ గాయపడ్డాడు. దీంతో దక్షిణాఫ్రికాతో జరగనున్న టెస్టు సిరీస్​కు దూరంకానున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టం చేశారు. రోహిత్​ స్థానంలో ప్రియాంక్​ పాంచల్​ను కవర్​ ప్లేయర్​గా ఎంపిక చేసింది బీసీసీఐ.

డిసెంబర్ 26న సెంచూరియన్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. జనవరి 3-7 వరకు రెండో టెస్టు, 11-15 వరకు మూడో టెస్టు నిర్వహించనున్నారు. అనంతరం మూడు వన్డేల సిరీస్​లో తలపడతాయి ఇరుజట్లు.

అందుకే అవకాశం..

దక్షిణాఫ్రికా ఏ జట్టుతో మ్యాచ్​లో 96 పరుగులు చేశాడు పాంచల్. ఇటీవలే ఆ దేశంలోనూ పర్యటించడం అతడికి కలిసివచ్చింది. పాంచల్​​కు.. ఈ రాత్రికే ముంబయిలోని టీమ్​ హోటల్​కు రావాలని పిలిపు వచ్చింది.

ఇదీ చూడండి:కోహ్లీ నాయకత్వంలో ప్రతిక్షణాన్ని ఆస్వాదించాను: రోహిత్

Last Updated : Dec 13, 2021, 7:15 PM IST

ABOUT THE AUTHOR

...view details