తెలంగాణ

telangana

By

Published : Feb 22, 2022, 8:58 AM IST

Updated : Feb 22, 2022, 11:50 AM IST

ETV Bharat / sports

ఐపీఎల్​ మెగావేలంపై సీఎస్కే ప్లేయర్​ సంచలన వ్యాఖ్యలు!

IPL mega aucion Robin utappa: ఐపీఎల్​ వేలం ప్రక్రియపై ఓ సీఎస్కే ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ ప్రక్రియకు స్వస్తి పలకాలని సూచించాడు. వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్ల మానసిక పరిస్థితి ఊహించలేనిదని చెప్పాడు.

IPL 2022 robin utappa mega auction
ఐపీఎల్​ మెగావేలం రాబిన్ ఉతప్ప

IPL mega aucion Robin utappa: ఐపీఎల్​ వేలంపై చెన్నై సూపర్​ కింగ్స్​ ప్లేయర్​ రాబిన్​ ఉతప్ప సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ వేలం ప్రక్రియ అసలు బాగోలేదని, సంతలో పశువులు వేలాన్ని చూసినట్లుగా అనిపిస్తుందని ఘాటూ వ్యాఖ్యలు చేశాడు. ఆయా ఫ్రాంఛైజీలు ఆటగాళ్ల కోసం పోటీ పడుతుంటే.. ఏదో వస్తువు కోసం పోటీ పడుతున్నట్లుగా దారుణంగా ఉందని అన్నాడు. వేలం సమయంలో ఆటగాళ్లు కూడా మనుషులే అన్న విషయాన్ని ఫ్రాంఛైజీలు మరిచిపోయి ప్రవర్తిస్తున్నాయని పేర్కొన్నాడు.

ఈ ప్రక్రియకు స్వస్తి పలికి, డ్రాఫ్ట్​ పద్ధతిలో జరగాలని సూచించాడు. వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్ల బాధ వర్ణణాతీతం అని ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, ఈ వేలంలో రాబిన్​ను చెన్నై సూపర్​ కింగ్స్​ బేస్​ ప్రైస్​ రూ.2కోట్లకు కొనుగోలు చేసింది. రాబిన్​.. 2006 నుంచి 2015 వరకు టీమ్​ఇండియా తరఫున 46 వన్డేలు(934 పరుగులు), 13 టీ20లు(249) ఆడాడు. ఐపీఎల్​లో 193 మ్యాచులు(4722 పరుగులు) ఆడాడు.

ఇదీ చూడండి: హాకీ జట్టు కెప్టెన్‌గా సవిత.. సత్తా చాటిన బాక్సర్ సుమిత్‌

Last Updated : Feb 22, 2022, 11:50 AM IST

ABOUT THE AUTHOR

...view details