తెలంగాణ

telangana

ETV Bharat / sports

'టీమ్​ఇండియా క్రికెటర్లు భారత్​లో తప్ప ఎక్కడా ఆడేది లేదు!'

ఐపీఎల్‌ తరహాలో తమ దేశంలోనూ లీగ్‌ను ఏర్పాటు చేయాలని సౌదీ అరేబియా ప్రభుత్వం భారీ ఆఫర్‌ను ప్రకటించినట్టు వార్తలు వచ్చాయి. అయితే బీసీసీఐ మాత్రం ఈ ఆఫర్​ను సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం!

bcci
bcci

By

Published : Apr 15, 2023, 8:24 PM IST

Updated : Apr 15, 2023, 9:21 PM IST

మరే దేశానికి చెందిన క్రికెట్​ లీగుల్లో టీమ్‌ఇండియా క్రికెటర్లు ఆడేది లేదని ఇప్పటికే భారత క్రికెట్‌ నియంత్రణ మండలి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ మేరకు మరోసారి కీలక ప్రకటన చేసినట్లు ఓ నివేదిక పేర్కొంది. ఐపీఎల్‌ లీగ్‌ మాదిరిగానే తమ దేశంలోనూ భారీ లీగ్‌ను ఏర్పాటు చేయండని ఫ్రాంచైజీ యజమానులకు సౌదీ అరేబియా క్రికెట్‌ ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా అలాంటి ఆఫర్‌పై బీసీసీఐ స్పందించినట్లు క్రికెట్‌ వర్గాలు తెలిపాయి. తమ టాప్‌ ఆటగాళ్లు ఆడకపోయినా విదేశీ లీగుల్లో భాగస్వామ్యం కాకుండా ఫ్రాంచైజీలను మాత్రం అడ్డుకోబోమని స్పష్టం చేసింది.

"ప్రస్తుతం భారత క్రికెట్‌కు ఆడుతున్న టాప్‌ ప్లేయర్‌ అయినా సరే విదేశీ లీగుల్లో పాల్గొనేందుకు అనుమతించం. ఐపీఎల్ ఫ్రాంచైజీలు అక్కడికి వెళ్తే మాత్రం ఆపేది లేదు. ఎందుకంటే ఇది వారి వ్యక్తిగత నిర్ణయం. ఇప్పటికే ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు దక్షిణాఫ్రికా, దుబాయ్‌ లీగుల్లో జట్లను సొంతం చేసుకున్నాయి. ప్రపంచంలో ఏ లీగులోనైనా తమ జట్టు ఉండాలని కోరుకోవడంలో ఆయా ఫ్రాంచైజీల తప్పు లేదు" అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

ఐపీఎల్‌ కంటే అత్యంత ధనిక లీగ్‌ను సౌదీ అరేబియాలో ప్రారంభించాలంటే.. టీమ్‌ఇండియా నుంచి టాప్‌ క్రికెటర్లు ఆడితేనే అది సాధ్యమవుతుంది. బిగ్‌బాష్ లీగ్‌, పాక్‌ లీగ్‌, దక్షిణాఫ్రికా, కరేబియన్ లీగ్‌ల్లో విదేశీ క్రికెటర్లు భారీ స్థాయిలో పాల్గొంటున్నప్పటికీ.. భారత్‌ నుంచి మాత్రం ఒక్కరూ ఆడటం లేదు. క్రికెట్‌ నుంచి వీడ్కోలు పలికితేనే ఆడేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న ఆటగాళ్లు ఆడాలంటే బీసీసీఐ నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సిందే.

అయితే అరేబియాలో ప్రపంచంలోనే అతిపెద్ద రిచెస్ట్ ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పటికే లీగ్​ నిర్వహణపై ఐపీఎల్ యజమానులతో సౌదీ ప్రతినిథులు చర్చలు సాగించినట్టు ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ విషయం గురించి పలు ఇంగ్లీష్ వైబ్​సైట్లతో కథనాలు వస్తున్నాయి. సౌదీ అరేబియాలో క్రికెట్​ను ప్రోత్సహించేందుకు.. ఐపీఎల్ తరహాలో భారీ టీ20లీగ్​ను నిర్వహించాలని అనుకుంటున్నారట. ఏడాది క్రితం నుంచే సౌదీ.. ఈ విషయమై గ్రౌండ్ వర్క్ చేస్తోందట. తమ దేశంలో నిర్వహించబోయే ఈ క్రికెట్ లీగ్​లో ఫ్రాంచైజీలను కొనుగోలు చేసేందుకు ముందుకు రావాలని, ఇందుకోసం రాయితీలను కూడా ఇచ్చేందుకు సౌదీ ప్రభుత్వం సిద్ధమైనట్టు కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే ఐపీఎల్​లోని చాలా ఫ్రాంచైజీలు.. వివిధ దేశాల్లో జరుగుతున్న లీగ్స్​లో భాగస్వామ్యమయ్యాయి.

Last Updated : Apr 15, 2023, 9:21 PM IST

For All Latest Updates

TAGGED:

bcci

ABOUT THE AUTHOR

...view details