తెలంగాణ

telangana

ETV Bharat / sports

IND VS WI 2023 : అశ్విన్​ 10 వికెట్ల ప్రదర్శన.. తొలి టెస్టులో రికార్డులు ఇవే.. - ఇండియా వర్సెస్​ వెస్టిండీస్​ లేటెస్ట్ న్యూస్

భారత బౌలింగ్‌ దెబ్బకు విండీస్‌ వేగంగా పతనమైంది. టీమ్​ ఇండియా అద్భుత ప్రదర్శనకు విండీస్​ తేలిపోయింది. ఇక జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించిన దిగ్గజ స్పిన్నర్​ రవిచంద్ర అశ్విన్​.. ఈ వేదికగా పలు రికార్డులను తన ఖాతాలోకి వేసుకున్నాడు. అవేంటంటే..​

Ravichandran Ashwin test records
Ravichandran Ashwin

By

Published : Jul 15, 2023, 11:55 AM IST

Ravichandran Aswin Test Records : విండీస్​లో జరుగుతున్న టెస్ట్​ పోరులో భారత సేన దూసుకెళ్తోంది. ఓ వైపు బ్యాటర్లు పరుగుల వరద పారిస్తుంటే.. మరో వైపు బౌలర్లు కూడా విజృంభించి వెస్టిండీస్ జట్టుకు చెమటలు పట్టిస్తున్నారు. తొలి టెస్టులో ఇన్నింగ్స్‌ 141 పరుగుల తేడాతో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అయితే విండీస్‌ మాత్రం తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 130 పరుగులకే కుప్పకూలింది. అయితే, వెస్టిండీస్‌ పతనంలో మన స్పిన్నర్​ రవిచంద్రన్ అశ్విన్​దే కీలక పాత్ర. అతడు ఆడిన రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ (5/60, 7/71) ఐదు వికెట్ల ప్రదర్శన ఇచ్చి తన సత్తా ఏంటో చాటాడు. అలా తన ఖాతాలో ఓ అరుదైన రికార్డును వేసుకున్నాడు.

భారత్‌ తరఫున అన్ని ఫార్మాట్లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అశ్విన్ రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ క్రమంలో ముందంజలో ఉన్న మాజీ ప్లేయర్​ హర్భజన్‌ సింగ్‌ 707 రికార్డును అశ్విన్​ అధిగమించాడు. ప్రస్తుతం అతడి ఖాతాలో 709 వికెట్లు ఉన్నాయి. టెస్టుల్లో 486 వికెట్లు, టీ20ల్లో 72, వన్డేల్లో 151 వికెట్లు తీశాడు. అయితే అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా మాజీ ప్లేయర్​ అనిల్ కుంబ్లే పేరు టాప్​లో ఉంది. ఆయన మొత్తం 953 వికెట్లు తీసి అందరి కంటే ముందున్నాడు.

మరోవైపు అశ్విన్‌ ఈ మ్యాచ్‌లో మొత్తం 12 వికెట్లు తీశాడు. ఇలా ఒకే మ్యాచ్‌లో పది లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టడం ఇది ఎనిమిదోసారి. ఈ రికార్డుతో అనిల్‌ కుంబ్లేతో సమంగా నిలిచాడు.. కుంబ్లే కూడా టెస్టుల్లో 10+ వికెట్లను ఎనిమిదిసార్లు తీశాడు. అలాగే అశ్విన్‌ ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం ఇది 34వ సారి. అంతే కాకుండా ఐదు వికెట్ల ప్రదర్శన సమయంలో జట్టు విజేతగా 28వసారి నిలవడం కూడా ఓ రికార్డే. ఇక శ్రీలంక మాజీ ప్లేయర్​ ముత్తయ్య మురళీ ధరన్ (41) అత్యధిక విజయాల్లో భాగస్వామ్యం కావడం విశేషం. ఈ క్రమంలో స్పిన్‌ దిగ్గజం షేన్‌వార్న్‌ను అశ్విన్ అధిగమించాడు. ఇక ఇదే మ్యాచ్‌లో యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ (171) భారీ శతకంతో అదరగొట్టాడు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డును సొంతం చేసుకున్నాడు.

  • ఇంకొన్ని రికార్డుల్లోకి చూస్తే..
    వెస్టిండీస్‌పై అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేసిన రెండో భారత బౌలర్ రవిచంద్రన్ అశ్విన్​ ఓ రికార్డును నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో 12/131 ప్రదర్శన చేశాడు. అతడికంటే ముందు నరేంద్ర హిర్వాణి (16/126) ఉన్నాడు.
  • ఆసియా బయట భారత్‌ సాధించిన ఇన్నింగ్స్‌ తేడాతో విజయాల్లో ఇదే అత్యుత్తమం. ఇప్పుడు ఇన్నింగ్స్‌ 141 పరుగుల తేడాతో భారత్ గెలిచింది. ఇలా జరగడం ఐదోసారి.
  • విదేశాల్లో అత్యుత్తమ బౌలింగ్‌ నమోదు చేసిన మూడో బౌలర్‌గానూ అశ్విన్ రికార్డు సృష్టించాడు. ఆసీస్‌పై భగవత్‌ చంద్రశేఖర్‌ 12/104 ప్రదర్శన చేయగా.. ఆ తర్వాత లిస్ట్​లో ఇర్ఫాన్‌ పఠాన్ (12/126) ఉన్నాడు.
  • విదేశాల్లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఐదు+ వికెట్లు తీసిన ఆరో భారత బౌలర్‌ అశ్విన్‌. బిషన్‌ సింగ్‌ బేడీ, భగవత్‌ చంద్రశేఖర్‌, వెంకటేశ్‌ ప్రసాద్, ఇర్ఫాన్‌ పఠాన్ (రెండుసార్లు) ఈ ఘనతను సాధించారు.
  • విండీస్‌పై అత్యధిక సార్లు ఐదు+ వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌ అశ్విన్. ఇప్పటి వరకు ఆరుసార్లు తీయగా.. హర్భజన్‌ సింగ్‌ ఐదుసార్లు పడగొట్టాడు. విండీస్‌పై ఇప్పటి వరకు విండీస్‌పై అశ్విన్‌ 72 వికెట్లు తీశాడు.
  • విండీస్‌పై భారత్ 23 టెస్టుల్లో విజయం సాధించింది. ఆసీస్‌మీద అత్యధికంగా 32 మ్యాచుల్లో, ఇంగ్లాండ్‌పై 31 మ్యాచుల్లో టీమ్‌ఇండియా గెలిచింది.
  • భారత బ్యాటర్‌ యశస్వి జైస్వాల్ విండీస్‌పై అరంగేట్రం చేసి సెంచరీ సాధించిన మూడో బ్యాటర్‌ కావడం విశేషం. ప్రస్తుత కెప్టెన్‌ రోహిత్ శర్మ (177), పృథ్వీ షా (134) విండీస్‌పైనే శతకాలు బాదారు.

ABOUT THE AUTHOR

...view details