కొవిడ్‌తో అల్లాడుతున్న భారత్‌కు పలువురు క్రికెటర్లు మద్దతుగా నిలుస్తున్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియా క్రికెటర్లు కమిన్స్, బ్రెట్ లీ, సచిన్ తెందుల్కర్ తమ వంతుగా సాయం ప్రకటించగా.. తాజాగా అఫ్గానిస్థాన్ బౌలర్ రషీద్ ఖాన్ కూడా ఈ జాబితాలో చేరాడు. భారత్‌కు మద్దతు ప్రకటిస్తూ ఉన్న ఓ వీడియోను ట్వీట్ చేశాడు. ప్రస్తుత ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు రషీద్.
"ఈ కష్ట సమయంలో అఫ్గానిస్థాన్‌లోని ప్రతి కుటుంబం భారత్‌కు మద్దతుగా ఉంటుంది. దయచేసి అందరూ సురక్షితంగా ఉండండి. సామాజిక దూరం పాటించండి. తప్పనిసరిగా మాస్క్ ధరించండి."
-రషీద్ ఖాన్, అఫ్గానిస్థాన్ క్రికెటర్.
కరోనాతో పోరాడుతున్న భారత్‌కు ఆసీస్ క్రికెటర్లు పాట్ కమిన్స్ రూ.37.36 లక్షలు, బ్రెట్ లీ ఒక బిట్ కాయిన్, క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ ఒక కోటి రూపాయలు విరాళమిచ్చారు. దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లోని ఆక్సిజన్ సరఫరా కోసం ఈ మొత్తాలను ఉపయోగించాలని వారు కోరారు.