తెలంగాణ

telangana

ETV Bharat / sports

Rashid Khan: జాతీయ జట్టు కెప్టెన్​గా రషీద్​ ఖాన్​ - Rashid Khan captain

తమ దేశం తరఫున టీ20 ఫార్మాట్​కు స్టార్​ లెగ్​ స్పిన్నర్​ రషీద్​ ఖాన్​ను(Rashid Khan) కెప్టెన్​గా నియమించింది అఫ్గానిస్థాన్ క్రికెట్​ బోర్డు. ఎన్నో ఏళ్లుగా అతడికి ఉన్న అనుభవం, అద్భుత ప్రదర్శనను దృష్టిలో ఉంచుకుని రషీద్​కు ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపింది.

rashid khan
రషీద్​ ఖాన్​

By

Published : Jul 6, 2021, 10:55 PM IST

తమ దేశ జాతీయ జట్టుకు కెప్టెన్​గా ఎంపికయ్యాడు అఫ్గానిస్థాన్​ స్టార్​ లెగ్​ స్పిన్నర్​ రషీద్​ ఖాన్(Rashid Khan)​. టీ20 ఫార్మాట్​ సారథ్య బాధ్యతల్ని అతడికి అప్పగించింది అఫ్గాన్ క్రికెట్​ బోర్డు(ఏసీబీ). టీ20 ప్రపంచకప్​ను దృష్టిలో ఉంచుకుని రషీద్​ను కెప్టెన్​గా నియమించింది. నజిబుల్లా జద్రాన్​కు వైస్​కెప్టెన్​ బాధ్యతలు అప్పగించింది.

"ఎన్నో ఏళ్లుగా అతడికి ఉన్న అనుభవం, అద్భుత ప్రదర్శన, నాయకత్వ లక్షణాలను దృష్టిలో ఉంచుకుని రషీద్​కు ఈ బాధ్యతలు అప్పగించాం" అని ఏసీబీ ప్రకటనలో తెలిపింది. తనను కెప్టెన్​గా ఎంపిక చేయడంపై హర్షం వ్యక్తం చేశాడు రషీద్​. దేశానికి సేవ చేయడాన్ని గౌరవంగా భావిస్తానని అన్నాడు.

గతంలోనూ కెప్టెన్​గా వ్యవహరించాడు రషీద్. వన్డేల్లో ఏడు, టెస్టుల్లో రెండు, టీ20ల్లో ఏడు మ్యాచ్​లకు సారథ్యం వహించాడు. అయితే ఇటీవల ఓ ఇంటర్యూలో పాల్గొన్న ఇతడు జాతీయ జట్టుకు సారథ్యం వహించే ఆలోచన లేదని అనడం గమనార్హం.

మరోవైపు, టెస్టు, వన్డేలకు హస్మతుల్లా షాహిదిని సారథిగా, రెహ్మత్​ షాను వైస్​ కెప్టెన్​గా నియమించింది అఫ్గాన్ బోర్డు.

ఇదీ చూడండి:Rashid Khan: 'మళ్లీ ఆ బాధ్యతలు వద్దు'

ABOUT THE AUTHOR

...view details