ఈ టీ20 ప్రపంచకప్‌లో(T20 worldcup 2021 schedule) స్పిన్నర్ల హవా సాగుతుందని అఫ్గానిస్థాన్ లెగ్ బ్రేక్ బౌలర్ రషీద్ ఖాన్ అన్నాడు(rashid khan t20 world cup). తాము మెరుగ్గా బ్యాటింగ్ చేస్తే ఏ జట్టునైనా ఓడించగలమని చెప్పాడు. యూఏఈలో పిచ్‌లపై స్పిన్నర్లెప్పుడూ ప్రభావవంతంగా బౌలింగ్ చేస్తారని అన్నాడు(uae t20 world cup 2021 schedule).
T20world cup 2021: 'ఇది స్పిన్నర్ల ప్రపంచకప్' - రషీద్ ఖాన్ టీ20 ప్రపంచకప్
టీ20 ప్రపంచకప్‌లో(T20 worldcup 2021) స్పిన్నర్లు బాగా రాణించగలరని అభిప్రాయపడ్డాడు అఫ్గానిస్థాన్ బౌలర్ రషీద్ ఖాన్(rashid khan t20 world cup). యుఏఈ పిచ్‌లు తమకు అనుకూలంగా ఉంటాయని అన్నాడు.
రషీద్ ఖాన్
"ఇక్కడ పరిస్థితులు ఎల్లప్పుడూ స్పిన్నర్లకు సహకరిస్తాయి. ఇది స్పిన్నర్ల ప్రపంచకప్ అవుతుంది. ఇక్కడ పిచ్‌లు ఎలా తయారు చేసినా సరే.. స్పిన్‌కే సహకరిస్తాయి. ప్రపంచకప్‌లో స్పిన్నర్లు కీలక పాత్ర పోషించబోతున్నారు. ఐపీఎల్‌లో ఎన్నో సార్లు వాళ్లు తమ జట్లను పోటీలోకి తేవడం చూశాం. ప్రపంచకప్‌లోనూ అదే జరుగుతుందని భావిస్తున్నా" అని రషీద్ ఖాన్ చెప్పాడు.
ఇదీ చూడండి: మెంటార్ ఆన్ డ్యూటీ.. పంత్‌కు ధోనీ కీపింగ్ పాఠాలు!