ఒకరేమో టీమ్‌ఇండియా మాజీ సారథి. ఇంకొకరేమో ప్రస్తుత కెప్టెన్. ఒకరేమో ‘కెప్టెన్ కూల్’గా ఫేమస్. ఇంకొకరు దూకుడైన కెప్టెన్సీకి కేరాఫ్ అడ్రస్. ఒకరు బెస్ట్ ఫినిషర్‌గా పేరు సంపాదించుకుంటే, మరొకరు ‘ఛేజింగ్ కింగ్’గా అభిమానుల గుండెల్లో నిలిచిపోయారు. ఈ పాటికి ఆ ఆటగాళ్లెవరో తెలిసే ఉంటుంది. అదేనండీ.. భారత క్రికెట్ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ, టీమ్‌ఇండియా ‘రన్ మెషీన్’ విరాట్ కోహ్లీ.
ఈ ఇద్దరు ఆటగాళ్లకు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులున్నారు. కొంతమంది ఆటగాళ్లు కూడా వీరికి అభిమానులుగా మారిపోయారు. అప్ఘానిస్థాన్ స్పిన్ మాంత్రికుడు రషీద్‌ఖాన్ కూడా విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీలపై తనకున్న అభిమానాన్ని ఇన్‌స్టా వేదికగా ప్రపంచానికి తెలియజేశాడు. ఇన్‌స్టాలో అభిమానులతో సరదాగా ప్రశ్న- జవాబు సెషన్ ద్వారా ముచ్చటించాడు. ఇందులో కొంతమంది అభిమానులు ధోనీ, కోహ్లీ గురించి రషీద్‌కు ప్రశ్నలు సంధించారు. వాటికి రషీద్ కూడా చాలా చక్కగా సమాధానాలిచ్చాడు.
అభిమాని: ఒక్కమాటలో విరాట్ కోహ్లీ గురించి వివరించండి.
రషీద్‌ఖాన్: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ‘కింగ్’.