Ramiz Raja On Ganguly: బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీతో మాట్లాడుతానన్నాడు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రాజా. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, పాకిస్థాన్, భారత్తో వన్డే టోర్నమెంట్ నిర్వహించాలని ప్రతిపాదించాడు. మార్చి 19న దుబాయ్లో జరిగే ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశంలో ఈ విషయంపై చర్చిస్తానన్నాడు. ఇండియాతో పాకిస్థాన్ ఆడితే ఆదాయం మరింత పెరుగుతుందని చెప్పాడు. కరాచీలోని జాతీయ స్టేడియంలో మీడియాతో మాట్లాడిన రాజా ఈ వ్యాఖ్యలు చేశాడు.
"దుబాయ్లో జరిగే ఏసీసీ సమావేశంలో సౌరభ్ గంగూలీతో నేను మాట్లాడతాను. మేమిద్దరం మాజీ నాయకులం, ఆటగాళ్లము. మా ఇద్దరికి క్రికెట్ అనేది రాజకీయం కాదు. ఒకవేళ ఇండియా మా ప్రతిపాదనతో అంగీకరించకపోతే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్తో పాకిస్థాన్లో మూడు దేశాల టోర్నీ నిర్వహిస్తాం. పాక్కు వస్తారని భావిస్తున్నాం. రాకపోతే ఏం చేయాలో అప్పుడు చూద్దాం."
-రమీజ్ రాజా, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్