కెప్టెన్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా లాంటి స్టార్స్ లేకుండానే శ్రీలంకతో తలపడేందుకు టీమ్ఇండియా మరో జట్టు సిద్ధమైంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ మ్యాచ్ మొదలుకానుంది. అయితే కొలంబోలో వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో మ్యాచ్ జరుగుతుందా లేదా అని అభిమానులు టెన్షన్ పడుతున్నారు.
జులై 13నే జరగాల్సిన తొలి వన్డే.. లంక జట్టులో కరోనా కలకలం కారణంగా 18వ తేదీకి వాయిదాపడింది. ఇప్పుడు వరుణుడు అడ్డంకిగా నిలిచే అవకాశాలున్న నేపథ్యంలో ఏం జరుగుతుందనేది చూడాలి!
టాస్ కీలకం
స్టార్ ఆటగాళ్లు లేకపోయినప్పటికీ.. యువ క్రికెటర్లతో బలంగా కనిపిస్తోంది భారత్. ఈ మ్యాచ్లో టాస్ కీలకంగా మారనుంది. గెలిచిన జట్టు ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించే అవకాశం ఎక్కువగా ఉంది.