ఈఏడాది న్యూజిలాండ్ పర్యటన కోసం టీమ్ఇండియా తాత్కాలిక కోచ్‌గా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్‌ను ఎంపికచేసే అవకాశం ఉన్నట్లు బీసీబీఐ వర్గాలు చెబుతున్నాయి. టీ20 ప్రపంచకప్ తర్వాత ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి తప్పుకోనున్న నేపథ్యంలో అతని స్థానంలో కొత్త కోచ్‌ను నియమించేందుకు బీసీసీఐ యోచిస్తోంది. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్లు అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్ పేర్లను పరిశీలించగా.. రాబోయే న్యూజిలాండ్ పర్యటనకు రాహుల్ ద్రవిడ్‌ను కోచ్‌గా నియమించనున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు.
న్యూజిలాండ్ పర్యటనలో టీమ్ఇండియా కోచ్‌గా ద్రవిడ్! - Dravid interim coach
న్యూజిలాండ్ పర్యటనలో టీమ్ఇండియా ప్రధానకోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌ను బీసీసీఐ ఎంపిక చేయనుందని సమాచారం. టీ20 ప్రపంచకప్ తర్వాత ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి ఆ పదవి నుంచి తప్పుకోవడం వల్ల అందుకోసం ద్రవిడ్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
న్యూజిలాండ్ పర్యటనలో టీమ్ఇండియా కోచ్‌గా ద్రవిడ్!
ఇటీవలే శ్రీలంక పర్యటనలో కోచ్‌గా వ్యవహరించిన అనుభవం ద్రవిడ్‌కు ఉంది. దీంతో కివీస్ పర్యటనకు ద్రవిడ్‌ను ఎంచుకోనున్నారని సమాచారం. అయితే టీమ్ఇండియా కోచ్ పదవి కోసం కొందరు ఆస్ట్రేలియా మాజీలు ప్రయత్నిస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.
ఇదీ చూడండి..IPL 2021 Final: అసలైనపోరులో ట్రోఫీ నెగ్గేదెవరు?