Rahul Dravid Head Coach Record : ఏ జట్టైనా కోచ్ పాత్ర ఎంతో కీలకం. ఎందుకంటే సదరు జట్టు గెలిచినా.. ఓడినా అతడే నైతిక బాధ్యత వహించాలి. టీమ్‌లో కాన్ఫిడెన్స్ నింపుతూ తన వ్యూహాలతో ముందుకు నడిపించడమే అతడి ప్రధాన లక్ష్యం. మరి రవిశాస్త్రి బై చెప్పాక.. టీమ్‌ఇండియా హెడ్‌కోచ్‌గా బాధ్యతుల స్వీకరించిన రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ఈ ఏడాది చివర్లో పూర్తవుతుంది. అయితే అతడి నేతృత్వంలో భారత జట్టు పలు విజయాలను, పరాజయాలను చూసింది. కానీ.. ఐసీసీ ట్రోఫీ మాత్రం అందుకోలేకపోయింది. రెండు ఐసీసీ ఈవెంట్లలో ఓటిమిని ఖాతాలో వేసుకుంది. టీ20 ప్రపంచకప్ 2022, WTC Final 2023లో ఘోరంగా ఓడిపోయింది.
మరికొన్ని రోజుల్లో ఆసియాకప్(Asia Cup 2023 ), ఆ తర్వాత స్వదేశంలో వరల్డ్‌కప్(ODI world cup 2023) జరగనున్నాయి. మరి ఈ రెండో మెగాటోర్నీలతోనైనా ఐసీసీ ట్రోఫీకి తెరదించుతాడో లేదో చూడాలి. రీసెంట్గా ఈ వరల్డ్ కప్ అతడు పలు ప్రయోగాలు చేసినా అవి మిశ్రమ ఫలితాలనే ఇచ్చాయి. దీంతో ఈ మెగా టోర్నీ కోసం ద్రవిడ్ ఎలాంటి వ్యూహాలతో ముందుకువెళ్తాడో అని ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో హెడ్ కోచ్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ద్రవిడ్ రికార్డ్ ఎలా ఉందో పరిశీలిద్దాం...
- నవంబర్ 2021 తర్వాత రవిశాస్త్రి నుంచి హెడ్ కోచ్‌గా బాధ్యతలు సీకరించాడు ద్రవిడ్. అతడి నేతృత్వంలో డిసెంబర్ 2021లో న్యూజిలాండ్‌పై టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది భారత్. ఒక టెస్టు మ్యాచ్‌లోనూ టీమ్‌ఇండియా విజయాన్ని అందుకుంది.
- ఆ తర్వాత టీమ్‌ఇండియాకు షాక్ తగిలింది. దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది. 2022 జనవరిలో టీమ్‌ఇండియా వన్డే సిరీస్, టెస్టు సిరీస్‌లో ఓటమిని అందుకుంది.
- అయితే ఆ తర్వాత టీమ్‌ఇండియా విజయాల పరంపర కొనసాగింది. 2022 ఫిబ్రవరి, మార్చి నెలలో జరిగిన వెస్టిండీస్, శ్రీలంక సిరీస్‌లను క్లీన్‌స్వీప్ చేసింది భారత జట్టు.
- 2022 జూన్‌లో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ఐర్లాండ్‌పై టీ20 సిరీస్ గెలిచింది.
- అనంతరం ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్, వన్డే సిరీస్ గెలవగా.. రీషెడ్యూల్ చేసిన ఐదో టెస్టు మ్యాచ్‌లో మాత్రం ఓడిపోయింది. ఇక 2022 జులై, ఆగస్టు నెలలో వెస్టిండీస్‌తో జరిగిన టీ20, వన్డే సిరీస్‌లలో విజయం సాధించింది.
- 2022 ఆగస్టు-సెప్టెంబర్‌లో జరిగిన ఆసియా కప్‌లో మాత్రం సూపర్ 4 దశ నుంచే వైదొలిగింది.
- నెక్ట్స్ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలపై విజయాలను అందుకుంది.
- అనంతరం 2022 అక్టోబర్‌లో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో జరిగిన సెమీఫైనల్‌లో ఓడిపోయింది.
- 2022 చివరి నెలలో బంగ్లాదేశ్‌పై వన్డే సిరీస్‌ను కోల్పోగా.. టెస్టు సిరీస్ మాత్రం నెగ్గింది.
- ఇక ఈ ఏడాది స్టార్టింగ్‌లో శ్రీలంక, ఆ తర్వాత న్యూజిలాండ్‌పై వరుసగా సిరీస్‌లలో గెలుపొందింది.
- 2023 ఫిబ్రవరి-మార్చిలో ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్‌లో ఓడిపోయింది. కానీ టెస్టు సిరీస్ గెలిచింది.
- జూన్‌లో జరిగిన WTC Finalలో మాత్రం ఘోరంగా ఓడిపోయింది.
- ఆ తర్వాత రీసెంట్గా వెస్టిండీస్ పర్యటనలో టెస్టు, వన్డే సిరీస్‌ల్లో గెలవగా.. పొట్టి ఫార్మాట్‌లో మాత్రం ఓడిపోయింది.