తెలంగాణ

telangana

ETV Bharat / sports

Pat Cummins Covid: యాషెస్​ రెండో టెస్టుకు కమిన్స్​ దూరం.. కెప్టెన్​గా స్మిత్​ - యాషెస్​ సిరీస్​

Pat Cummins Covid: కరోనా సోకిన వ్యక్తికి సన్నిహితంగా ఉన్న కారణంగా యాషెస్ రెండో టెస్టుకు దూరమయ్యాడు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్. అతడి స్థానంలో స్టీవ్ స్మిత్ కెప్టెన్​గా వ్యవహరించనున్నాడు.

pat cummins covid
steve smith news

By

Published : Dec 16, 2021, 7:27 AM IST

Pat Cummins Covid: యాషెస్​ సిరీస్​లో ఆస్ట్రేలియాకు గట్టి షాక్​ తగిలింది. కరోనా సోకిన వ్యక్తికి సన్నిహితంగా ఉన్న కారణంగా గురువారం అడిలైడ్​ వేదికగా జరగనున్న డేనైట్​ టెస్టుకు ఆసీస్​ కెప్టెన్ ప్యాట్​ కమిన్స్​ దూరమయ్యాడు. కరోనా రిపోర్టులో అతడికి నెగిటివ్​గా తేలినా.. పాజిటివ్​ వచ్చిన వ్యక్తితో సన్నిహితంగా ఉండటం వల్ల అతడు వారం రోజుల పాటు ఐసొలేషన్​లో ఉండనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. అయితే మెల్​బోర్న్​లో జరిగే మూడో టెస్టుకు అతడు అందుబాటులోకి వస్తాడని ఆశిస్తోంది.

కెప్టెన్​గా మళ్లీ స్మిత్..

ప్యాట్​ కమిన్స్​ గైర్హాజరులో స్టీవ్​ స్మిత్​ కెప్టెన్​గా వ్యవహరించనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. ట్రావిస్ హెడ్ వైస్​ కెప్టెన్​గా ఉండనున్నాడు. ఈ మ్యాచ్​తో మైఖేల్ నెసెర్ టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నాడు.

ఇదీ చూడండి:Ashes 2nd test 2021: జట్టులోకి అండర్సన్​.. ఇంగ్లాండ్​ టీమ్​ ఇదే

ABOUT THE AUTHOR

...view details