Rishabh Pant Batting : టీమ్‌ఇండియా జట్టుకు అలాగే అభిమానులకు గుడ్ న్యూస్ అందింది. గతేడాది చివర్లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యంగ్ బ్యాటర్ అండ్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టేశాడు. ఓ లోకల్ మ్యాచ్‌లో అతడు బ్యాటింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోను చూసి క్రికెట్ అభిమానలు.. ఫుల్ ఖుషీ అవుతున్నారు. అతడు త్వరగా మళ్లీ మాములు స్థితికి చేరుకుని ఫిట్‌నెస్ సాధించాలని, అలాగే మళ్లీ టీమ్‌ఇండియా తరఫున బరిలోకి దిగి బ్యాట్ పట్టుకోవాలని తెగ కామెంట్లు చేస్తూ ఆ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.
ఇకపోతే రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషభ్ పంత్‌కు రెండు మూడు శస్త్రచికిత్సలు జరగడం వల్ల.. దాదాపు మూడు నెలలపాటు బెడ్‌పైనే ఉన్నాడు. అయితే చాలా వేగంగానే కోలుకుంటున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రిహబిలిటేషన్‌లో చికిత్సను కొనసాగిస్తున్నాడు. అక్కడ ప్రత్యేకంగా స్ట్రెంత్, ఫ్లెక్సిబిలిటి, రన్నింగ్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనేబెంగళూరులోని జేఎస్‌డబ్ల్యూ విజయ్‌నగర్‌లో జరిగిన ఓ ప్రాక్టీస్ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేశాడు పంత్.