టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం సాధించింది. కోహ్లీ అద్భుత ప్రదర్శన చేశాడు. అయితే ఇవేవీ పాకిస్థాన్‌కు చెందిన కొందరు మాజీ క్రికెటర్లు మింగున పడట్లేదు. పాక్ బౌలర్ నవాజ్ వేసిన చివరి ఓవర్లో 'నో బాల్' నిర్ణయం వివాదానికి దారితీసింది. ఇక్కడ విరాట్ కోహ్లీని ఏమీ అనడానికి లేదు. ఎందుకంటే 'నో బాల్' అప్పీల్ చేసుకొనే హక్కు అతడికి ఉంది. దీంతో బాణం అంపైర్ ఎరాస్మస్ వైపు మళ్లింది. విరాట్ అడగగానే ఎరాస్మస్ మరో అంపైర్‌తో చర్చించకుండానే నిర్ణయం తీసుకొన్నాడని పాక్ దిగ్గజాలు వసీం అక్రమ్, వకార్ యూనిస్, షోయబ్ మాలిక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విరాట్ కోహ్లీ తప్పు లేదని చెబుతూనే.. టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత కూడా ఇలాంటి నిర్ణయాలు వెలువడటం సరైంది కాదని ఆక్షేపించారు.
"బంతిని చూస్తే కిందకు దిగుతున్నట్లుగానే అనిపించింది. బంతి గమనం చెక్ చేసే కెమెరాలోనూ నోబాల్‌గా కనిపించలేదు. స్లో మోషన్లో కూడా దిగుతుందేమో అనిపించేలా ఉంది. అయితే బ్యాటర్‌కు నో బాల్ గురించి అడిగే హక్కుంది. కోహ్లీ పొరపాటు అస్సలు లేదు. అయితే ఇలాంటి పెద్ద మ్యాచుల్లో టెక్నాలజీని వాడుకుంటే బాగుండేది. మనకు మంచి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది. అనవసరంగా వివాదాలకు అవకాశం ఇవ్వడం ఎందుకు?" - వసీం అక్రమ్