తెలంగాణ

telangana

ETV Bharat / sports

T20 World Cup: భారత్​పై గెలిస్తే పాక్ ఆటగాళ్లకు భారీ బోనస్ - భారత్ X పాకిస్థాన్ మ్యాచ్

టీ20 ప్రపంచకప్​లో భారత్​, పాకిస్థాన్​ మ్యాచ్(IND vs PAK T20 Match)​ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆదివారం జరగనున్న ఈ మ్యాచ్​లో ఎలాగైనా గెలిచి భారత్​పై తొలి టీ20 విజయం తమ ఖాతాలో వేసుకోవాలని పాక్​(Pakistan Squad for T20 World Cup) ఆశిస్తోంది. ఈ మ్యాచ్​ నెగ్గితే పాక్​ ఆటగాళ్లకు ఫుల్ బోనస్​ లభించనుందని ఓ నివేదిక పేర్కొంది.

pakisthan team
పాకిస్థాన్ జట్టు

By

Published : Oct 23, 2021, 4:55 PM IST

టీ20 ప్రపంచకప్(T20 World Cup 2021)​ సూపర్-12 పోటీల్లో భారత్​, పాకిస్థాన్​ హై వోల్టేజీ మ్యాచ్​(IND vs PAK T20 Match) ఆదివారం(అక్టోబర్ 24) దుబాయ్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్​లో టీమ్​ఇండియాపై విజయం సాధిస్తే పాకిస్థాన్(Pakisthan Squad World Cup 2021)​ ఆటగాళ్లకు భారీ బోనస్​ లభించనుందని ఓ నివేదిక పేర్కొంది.

ఇప్పటివరకు భారత్, పాకిస్థాన్​ తలపడ్డ 12 మ్యాచ్​ల్లో టీమ్​ఇండియాదే పైచేయి. 5 టీ20, 7 వన్డే వరల్డ్​కప్​ మ్యాచ్​లో భారత్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఆదివారం బాబర్ అజామ్​సేన గెలిస్తే.. మ్యాచ్​ ఫీజుకు 50 శాతం ఎక్కువ.. అంటే దాదాపు రూ. 1,70,000 ఎక్కువ ఇవ్వనున్నట్లు ఓ రిపోర్డ్​ ద్వారా తెలిసింది.

ప్రస్తుతం పాక్​ క్రికెటర్లకు ఒక్క మ్యాచ్​కు రూ. 3,38,250 ఫీజు ఇస్తుండగా భారత్​పై(T20 World Cup Team India ) గెలిస్తే వారికి రూ. 5 లక్షలకు పైగా తీసుకోనున్నారు. టీ20లో ప్రపంచ నెంబర్​ వన్ టీమ్​ ఇంగ్లాండ్​పై గెలిస్తే కూడా పాక్​ ఆటగాళ్లకు ఫుల్ బోనస్​ రానుందని రిపోర్టు పేర్కొంది. ఒకవేళ టోర్నీ గెలిస్తే వారికి 300 శాతం ఎక్కువగా ఫీజు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

అయితే.. రెండు వార్మప్​ మ్యాచ్​ల్లో గెలిచి పూర్తి విశ్వాసంతో ఉన్న భారత్​.. పాక్​ను మరోసారి చిత్తు చేయాలని ఆశిస్తోంది. భారత్ విజయదుందుభి మోగించి 13-0తో పాక్​పై పైచేయి సాధించాలని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు.

ఇదీ చదవండి:

IND vs PAK T20: భారత్​తో పోరు.. జట్టును ప్రకటించిన పాక్

ABOUT THE AUTHOR

...view details