పాకిస్థాన్ పేసర్ హారిస్ రవుఫ్ ఓ ఇంటివాడయ్యాడు. ముజ్నా మసూద్ మాలిక్‌తో శనివారం హారిస్ వివాహం జరిగింది. అయితే.. వీరి వెడ్డింగ్ వీడియో ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటోంది. వీడియో మధ్యలో 'నన్ను క్షమించు' అంటూ పెళ్లి కూతురుతో క్రికెటర్ నవ్వుతూ అన్న మాటలు ఫన్నీగా ఉన్నాయి. ఏదైనా పొరపాటు జరగ్గానే 'మాఫ్ కరో' అంటాం కదా.. అలా పెళ్లి అయిన వెంటనే సదరు పేసర్ తన సతీమణితో అనడం అందరిలోనూ నవ్వులు పూయించింది.
'నన్ను ఇప్పుడు క్షమించేయ్'.. పెళ్లికూతురితో క్రికెటర్ ఫన్నీ వీడియో
ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా గాయపడి విశ్రాంతి తీసుకుంటున్న పాక్ పేసరమ్ హారిస్ రవుప్ వివాహం చేసుకున్నాడు. అయితే వధువుతో కలిసి అతడు చేసిన వీడియో వైరల్‌గా మారింది.
pakistan-pacer-haris-rauf-is-all-smiles-in-adorable-wedding-video
ఇక వీరి వివాహ కార్యక్రమానికి మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది, పేసర్ షహీన్ షా అఫ్రిది, సమీన్ రానా, అతిఫ్ రానా, ఆఖిబ్ జావెద్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వధూవరులు ఇద్దరు కలిసి దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఆ వీడియోను మీరు కూడా చూసేయండి.