తెలంగాణ

telangana

ETV Bharat / sports

Haider Ali Runout Video : విచిత్రంగా స్టంపౌట్ అయిన పాకిస్థానీ ప్లేయర్​! - విటాలిటీ టీ20 బ్లాస్ట్ టోర్నీ

ఇటీవలే జరిగిన విటాలిటీ టీ20 బ్లాస్ట్ టోర్నీలో విచిత్రంగా ఔటయ్యాడు పాకిస్థాన్ స్టార్ ప్లేయర్ హైదర్ అలీ. ఆ వీడియోను మీరు కూడా ఓ సారి చూసేయండి మరి..

Etv Bharat
Etv Bharat

By

Published : Jun 9, 2023, 11:22 AM IST

Updated : Jun 9, 2023, 11:53 AM IST

Haider Ali Runout Video : క్రీడల్లో అప్పుడప్పుడు ఎన్నో చిత్ర విచిత్రమైన ఘటనలు జరుగుతుంటాయి. తాజాగా ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్ టోర్నీలో కూడా సరిగ్గా ఇదే జరిగింది. విటాలిటీ బ్లాస్ట్ తన ట్విట్టర్​ ఖాతాలో షేర్​ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఇందులో పాకిస్థానీ ఆటగాడు హైదర్‌ అలీ విచిత్రంగా స్టంపౌట్‌ అవ్వడం అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది. ఈ వీడియోను చూసిన అభిమానులు నవ్వుకుంటూ.. సోషల్​ మీడియాలో దీన్ని షేర్​ చేస్తూ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

అసలేం జరిగిందంటే..?
వార్విక్‌షైర్ స్పిన్నర్ డాన్నీ బ్రిగ్స్ 11వ ఓవర్‌లో వేసిన ఫుల్ లెన్త్ బాల్​కు హైదర్ అలీ.. స్టెప్ ఔటై భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. ఇది గమనించిన బౌలర్.. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా బంతిని వేసాడు. దాంతో హైదర్ అలీ బ్యాట్‌ను మిస్సై బంతి వికెట్ కీపర్ చేతిలో పడింది. ఈ బంతిని అందుకునే క్రమంలో వికెట్ కీపర్ కాస్త తడబడగా.. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు హైదర్ అలీ ట్రై చేశాడు. ముందుగా స్టంపౌట్‌ను తప్పించుకునేందుకు బ్యాట్‌ను క్రీజులో పెట్టిన హైదర్.. ఆ తర్వాత కీపర్ బంతిని వికెట్లకు కొట్టేసాడని అనుకుని పరుగులు తీసేందుకు ప్రయత్నించాడు. కానీ బంతిని చేతులోనే ఉంచుకున్న వికెట్ కీపర్ స్టంపౌట్ చేశాడు. దాంతో హైదర్ అలీ ఒక్కసారిగా షాకయ్యాడు.

ఇక మ్యాచ్​ విషయానికి వస్తే.. విటాలిటీ బ్లాస్ట్​గా పేరొందిన ఈ టీ20 టోర్నీలో భాగంగా బర్మింగ్‌హామ్​లోని ఎడ్జ్‌బాస్టన్​ వేదికగా బుధవారం డెర్బీషైర్ ఫాల్కన్స్​ - వార్విక్​షైర్​ జట్లు పోటీపడ్డాయి. ఎంతో ఉత్కంఠగా జరిగిన ఈ పోరులో హైదర్ అలీ ప్రాతినిథ్యం వహించిన డెర్బీషైర్ జట్టు.. వార్విక్​షైర్ జట్టుపై ఆరు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ముందుగా బ్యాటింగ్​కు దిగిన వార్విక్‌షైర్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 203 పరుగులు చేసింది. ఇక అలెక్స్ డేవిస్, సామ్ హైన్, డాన్ మౌస్లీ ఈ మ్యాచ్​లో రాణించారు. ఆ తర్వాత లక్ష్యచేధనకు దిగిన డెర్బీ షైర్ 19.3 ఓవర్లలోనే 4 వికెట్లకు 207 పరుగులు చేసి విజయాన్ని తన ఖాతాలోకి వేసుకుంది. ఇక ఈ జట్టులోని లూయిస్ రీస్, లూస్ డూ పోలీ, అర్ధశతకాలతో రాణించగా.. హైదర్ అలీ కూడా తనవంతు పరుగులను ఇచ్చాడు.

Last Updated : Jun 9, 2023, 11:53 AM IST

ABOUT THE AUTHOR

...view details