భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ అంటేనే రికార్డులకు మారుపేరు. వన్డేల్లో అతడు 15వేల మార్క్‌ను అందుకుని నేటికి 14 ఏళ్లు అవుతోంది. క్రికెట్ చరిత్రలో ఈ ఘనత అందుకున్న ఏకైక బ్యాట్స్‌మన్ లిటిల్ మాస్టర్ కాగా.. ఇంతవరకు ఈ రికార్డు చెక్కుచెదరకుండా ఉంది. దీనిని ఇప్పట్లో అధిగమించే క్రికెటర్ దరిదాపుల్లో కూడా లేడు.
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా 2007లో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో సచిన్ ఈ ఫీట్ సాధించాడు. 227 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన టీమ్ఇండియాకు.. సచిన్ అద్భుత అర్ధ సెంచరీతో విజయానికి బాటలు వేశాడు. 106 బంతుల్లో 93 రన్స్ చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలోనే 15వేల మార్క్‌ను అందుకున్నాడు తెందుల్కర్. ఈ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
1989 నవంబర్ 15న టెస్ట్ ఫార్మాట్‌తో క్రికెట్ కెరీర్‌ను ప్రారంభించిన సచిన్.. అదే ఏడాది డిసెంబర్ 18న వన్డేల్లో చోటు సంపాదించాడు. సుదీర్ఘ ఫార్మాట్లో 51 సెంచరీల సాయంతో 15,921 పరుగులు చేశాడు మాస్టర్ బ్లాస్టర్. శతకాల సంఖ్యలోనూ సచిన్ రికార్డు అలాగే ఉంది. ఇక వన్డేల్లో 49 సెంచరీలతో 18,426 రన్స్ చేశాడు లిటిల్ మాస్టర్. మొత్తం 24 ఏళ్ల తన క్రికెట్ జీవితంలో మొత్తం ఆరు ప్రపంచకప్‌లలో టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు. 2011 ప్రపంచకప్ గెలిచిన జట్టులో తెందుల్కర్ సభ్యుడు.